Aadhaar Update : ఇకపై ఆధార్ అప్డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aadhaar Update : ఇకపై ఆధార్ అప్డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Aadhaar Update : ఇకపై ఆధార్ అప్డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే...!

భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు పత్రం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పత్రాలు చాలా విషయాలలో ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాక భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆధార్ కార్డు అప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ ఆధార్ కార్డు ద్వారానే మీరు ఎవరు అనే నిజాన్ని ఇతరులు తెలుసుకోగలుగుతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం తప్పుగా ఉన్న గడువు ముగిసిన దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది తప్పనిసరి. అయితే ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ పత్రాలు అందించాల్సిందే. ఇక ఈ విషయాన్ని ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డు హోల్డర్లు ఇక నుంచి వారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అంటే ఈ డాక్యుమెంట్స్ కొన్నింటిని కచ్చితంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Aadhaar Update  ముఖ్యమైన పత్రాలు…

మీరు మీ యొక్క ఆధార్ కార్డులో పేరు లేదా చిరునామాను మార్చాలి అంటే కచ్చితంగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ పాస్ పోర్ట్, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఉండవు కాబట్టి పాన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ చిరునామాగా పరిగణించబడుతుంది. అలాగే రేషన్ మరియు ఈ రేషన్ కార్డులు చిరునామా రుజువుగా పరిగణించబడవు. దీంతో చాలామంది వారి ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విద్యుత్ మరియు నీరు టెలిఫోన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అయితే ఎవరి పేరుతో కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ లేదా వాటర్ బిల్ ఉంటుందో వారు వారి యొక్క ఆధార్ కార్డులో చిరునామాను అప్డేట్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు.

Aadhaar Update ఇకపై ఆధార్ అప్డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే

Aadhaar Update : ఇకపై ఆధార్ అప్డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే…!

అంతేకాక పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులను కూడా దీనికోసం మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు కలిగిన వారు తమ జీవిత వైద్య బీమా పాలసీలను పొందవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) తెలియజేయడం జరిగింది. కావున ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకునేవారు పైన పేర్కొనబడిన పత్రాలను ఉపయోగించుకుని మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది