Nukaraju Immanuel : ఇదేం టాలెంట్‌రా బాబు.. నూకరాజు, ఇమాన్యుయల్‌లకు హ్యాట్సాఫ్
Nukaraju Immanuel : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో నూతన సంవత్సరం వేడుకలు ఎంతో ఎంటర్టైనింగ్ గా జరుపుకున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం శనివారం రావడంతో శని, ఆదివారం ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలను జరుపుకున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో స్కిట్లు వేసి ప్రేక్షకులను నవ్వించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్జీలుగా ఇంద్రజ, మహేశ్వరి వ్యవహరించారు.
ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన కమెడియన్స్ పలువురు తమదైన శైలిలో స్కిట్లు వేసి ప్రేక్షకులను ఆకట్టుకోగా కమెడియన్ నూకరాజు ఇమ్మానియేల్ మాత్రం వారి అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. నూకరాజు ముందు పాట పాడటం అనంతరం ఇమ్మానియేల్ ఫిమేల్ వాయిస్ తో ఎంతో అద్భుతంగా పాడారు. ఇలా వీరు పాట పాడటంతో స్టేజ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.

Nukaraju Immanuel shows their talent in sridevi drama company show
Nukaraju Immanuel ఇమ్మానియేల్ పై ప్రశంశలు కురిపించిన మహేశ్వరి
ఈ కార్యక్రమంలో భాగంగా ఇమ్మానియేల్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని ఫిమేల్ వెర్షన్ లోని పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఇలా ఇమెయిల్ ఫిమేల్ వాయిస్ తో పాట పాడటంతో హీరోయిన్ మహేశ్వరి అతని పై ప్రశంసలు కురిపించింది. ఇలా నూకరాజు, ఇమ్మానియేల్ ఒకవైపు తమదైన శైలిలో కామెడీ పండిస్తూనే మరొకవైపు అద్భుతంగా పాటలు పాడుతూ వారి టాలెంట్ ఏంటో బయటపెట్టారు.
