Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ తర్వాత సూదితో చుచుతున్నట్లుగా గానీ, ఎవరో పట్టేసి చితికినట్లు గానీ అనిపిస్తోందా? అది విటమిన్ B12 లోపం కారణంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ B12 శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారయ్యే ప్రక్రియలో, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు
ఇది ముఖ్యంగా మాంసాహార ఆహారం ద్వారా లభిస్తుంది . గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి ప్రధాన వనరులు. అందుకే, కఠినంగా శాఖాహారం పాటించే వారిలో B12 లోపం కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12 లోపం లక్షణాలు ఏంటి అనేది చూస్తే చేతులు, కాళ్లలో తరచూ తిమ్మిరి, జలదరింపు, అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి తక్కువవటం , తల తిరగడం, మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్, నోటిలో పుండ్లు లేదా నాలుక వాపు
మీ రోజువారీ ఆహారంలో గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, చేపలు, చికెన్ వంటి వాటిని చేర్చడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. శాకాహారులైతే ..డాక్టర్ సలహాతో B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. అవసరమైతే ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. తిమ్మిరి, అలసట, తల తిరగడం లాంటి లక్షణాలు ఉంటే, వెంటనే రక్తపరీక్షలు చేయించుకొని B12 స్థాయిని తనిఖీ చేయడం ముఖ్యం.చేతులు, కాళ్లలో తిమ్మిరి అనేది చాలా సార్లు తేలికపాటి సమస్యగా అనిపించినా, దీని వెనుక గంభీర ఆరోగ్య సమస్య దాగివుండొచ్చు. విటమిన్ B12 లోపం, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే, నరాల సమస్యలతో పాటు మరిన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
This website uses cookies.