Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ తర్వాత సూదితో చుచుతున్నట్లుగా గానీ, ఎవరో పట్టేసి చితికినట్లు గానీ అనిపిస్తోందా? అది విటమిన్ B12 లోపం కారణంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ B12 శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారయ్యే ప్రక్రియలో, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Vitamin B12 చేతులు కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా జాగ్రత్త ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిసరి..

ఇది ముఖ్యంగా మాంసాహార ఆహారం ద్వారా లభిస్తుంది . గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి ప్రధాన వనరులు. అందుకే, కఠినంగా శాఖాహారం పాటించే వారిలో B12 లోపం కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12 లోపం లక్షణాలు ఏంటి అనేది చూస్తే చేతులు, కాళ్లలో తరచూ తిమ్మిరి, జలదరింపు, అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి తక్కువవటం , తల తిరగడం, మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్, నోటిలో పుండ్లు లేదా నాలుక వాపు

మీ రోజువారీ ఆహారంలో గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, చేపలు, చికెన్ వంటి వాటిని చేర్చ‌డం వ‌ల‌న కాస్త ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. శాకాహారులైతే ..డాక్టర్ సలహాతో B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. అవసరమైతే ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. తిమ్మిరి, అలసట, తల తిరగడం లాంటి లక్షణాలు ఉంటే, వెంటనే రక్తపరీక్షలు చేయించుకొని B12 స్థాయిని తనిఖీ చేయడం ముఖ్యం.చేతులు, కాళ్లలో తిమ్మిరి అనేది చాలా సార్లు తేలికపాటి సమస్యగా అనిపించినా, దీని వెనుక గంభీర ఆరోగ్య సమస్య దాగివుండొచ్చు. విటమిన్ B12 లోపం, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే, నరాల సమస్యలతో పాటు మరిన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది