కరోనా తగ్గకున్నా తన బెడ్ ను ఓ యువ‌కుడికి ఇచ్చిన 85 ఏళ్ల తాత.. 3 రోజులకే ..?

0
Advertisement

Corona Second Wave : ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా సెకండ్ వేవ్… విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే… వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా భయం కూడా ప్రజల్లో ఎక్కువవుతోంది. కరోనా వల్ల ఇప్పటికే చాలామంది ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నారు. కరోనా వచ్చినా… ఆసుపత్రికి వెళ్తే… సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

old man who has corona sacrifices his bed and dies in nagpur
old man who has corona sacrifices his bed and dies in nagpur

ముఖ్యంగా ఆక్సీజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్స్ దొరకక… తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. చాలామంది ఆక్సీజన్ అందక… శ్వాసకు సంబంధించిన సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఆక్సీజన్ సిలిండర్లను తెప్పించినా… రోజురోజుకూ విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో… ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆక్సీజన్ సరిపోక… పిట్టల్లా కరోనా పేషెంట్లు చనిపోతున్నారు.

తాజాగా… ఓ తాత.. 85 ఏళ్ల తాతకు కరోనా రావడంతో… నాగ్ పూర్ లోని ఇందిరాగాంధీ ఆసుపత్రిలో చేరాడు. కరోనాకు ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడు. అసలే వయసు ఎక్కువైంది కదా… పరిస్థితి కూడా కాస్త తీవ్రంగా ఉండటంతో డాక్టర్లు కూడా తాతకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది. తన వెంట ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆసుపత్రికి వచ్చి ఏడుస్తూ… అటూ ఇటూ తిరుగుతూ… తన భర్తను ఆసుపత్రిలో చేర్పించుకోవాలంటూ అక్కడున్న డాక్టర్లను బతిమిలాడుతోంది. కానీ… బెడ్స్ ఖాళీ లేవంటూ డాక్టర్లు ఆ మహిళను వెళ్లిపోవాలంటూ చెప్పడం ఆ తాత చూశాడు. దీంతో వెంటనే డాక్టర్లను పిలిచి… తన బెడ్ ను ఆ మహిళ భర్తకు ఇవ్వాల్సిందిగా కోరాడు.

Corona Second Wave : జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మనిషి

తన బెడ్ ఆ మహిళ భర్తకు ఇవ్వాలని… ఆ వ్యక్తిది చాలా చిన్న వయసు అని… పిల్లలు కూడా ఉన్నారని… తన జీవితం ఎలాగూ అయిపోయిందని… డాక్టర్లను వేడుకున్నాడు. ముందు డాక్టర్లు ఒప్పుకోకున్నా… ఆయన మానవత్వం చూసి ఓకే చెప్పారు. వెంటనే ఆ తాతతో ఓ లెటర్ రాయించుకొని… ఆ మహిళ భర్తకు బెడ్ ఇచ్చారు డాక్టర్లు. తాత… డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి ఇంటి వద్దనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అయితే… ఇంటికి వచ్చిన మూడు రోజులకే ఆక్సీజన్ లేవల్స్ పడిపోయి తాత ప్రాణాలు విడిచాడు. ఇక.. ఆ తాత త్యాగం గురించి తెలుసుకున్న నెటిజన్లు.. తాతను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… ఆయన చేసిన త్యాగానికి గొప్ప నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement