Social Media : సోషల్ మీడియాలో.. సరదాగా అనుకుంటే.. ఇంత సంపాదిస్తున్నారా
Social Media : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కామన్. ఇవి రెండూ మన జీవితంలో భాగంగా మారాయి. చాలా మంది సరదాగా వీడియోలు చేస్తున్నారు అనుకుంటాం కానీ వీటి వల్ల వచ్చే ఆదాయం చూస్తే మతి పోవాల్సిందే.. సోషల్ మీడియాలో పోస్ట్ లతో డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. హాయిగా ఇంట్లో కూర్చొనే తమ టాలెంట్ ని చూపిస్తూ లక్షలు సంపాదించవచ్చు. చాలా వరకు ఎక్కువ మంది సరదా కోసం రీల్స్ చేస్తుంటారు. ఫాలోవర్స్ ని పెంచుకోవాలని కొత్తగా ప్రయత్నిస్తుంటారు. లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచుకుని ఇఫ్లుయెన్సర్ గా మారతారు.
మరికొంత మంది ఉపాధి కోసమే సోషల్ మీడియాలో తమ టాలెంట్ ని బయటపెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. సెలబ్రిటీలే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారి మనీ కొల్లగొడుతున్నారు.సెలెబ్రిటీ అయినా, సాధారణ వ్యక్తులైనా తమ పోస్టుల ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నార. ఇక యూట్యూబ్ లో అయితే లెక్కలేనన్ని వీడియోలు దర్శనమిస్తుంటాయి. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఉపాధిపొందుతున్నారు. మంచి కంటెంట్ ను అప్లోడ్ చేస్తూ వేల్లో సబ్ స్క్రైబర్స్, లక్షల్లో వ్యూస్, కామెంట్స్ తెచ్చుకుంటూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇక సెలబ్రిటీలైతే కోట్లల్లో ఉంటుంది వారి ఆదాయం. అయితే ఫాలోవర్స్ బట్టి ఆదాయం నిర్ణయించబడుతుంది.
ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆదాయం.. అలాగే వ్యూస్ బట్టి కూడా ఆదాయం పొందవచ్చు.అలాగే ఎదైనా కంపెనీ బ్రాండ్ కి సంబంధించిన పోస్ట్ చేయడం ద్వారా కూడా సదరు కంపెనీ నుంచి ఆదాయం ఉంటుంది. అయితే ఇది ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవాళ్లకు.. అంటే సెలబ్రిటీలకు ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. అలాగే కంటెంట్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. యూట్యూబ్ లో కంటెంట్ ప్లే చేసినప్పుడు కొన్ని యాడ్స్ ప్లే అవుతుంటాయి. వీటి వల్ల కూడా సదరు యూట్యూబ్ చానల్ కు ఆదాయం వస్తుంది. ఇందుకు ఆ చానల్ కు ఎక్కువగా సబ్ స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉండటమే. మీరు కూడా సరదాగా కాకుండా ఆదాయం వచ్చేలా ఇన్ ఫ్లూయన్సర్ గా మారండి.