YSRCP : బీసీలకు ఇంతకు మించి చేసే దమ్ము ఏ పార్టీకైనా ఉందా?
YSRCP : దేశంలో మెజారిటీగా ఉన్న బీసీలకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా 50 శాతం అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. కేవలం వైకాపా మాత్రం బీసీలకు పూర్తిగా న్యాయం చేస్తూ ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ కు చెందిన బీసీ నాయకుడు దేశ వ్యాప్తంగా బీసీ ల సంక్షేమం కోసం పోరాటాలు చేసిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి వైఎస్‌ఆర్ పార్టీ ఎంతగా తాపత్రయ పడుతుందో అర్థం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు.
ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోని సంచలన నిర్ణయాన్ని కేవలం వైకాపా మాత్రమే తీసుకుంది. జగన్ గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు ఖచ్చితంగా 50 శాతం అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నాలుగు రాజ్యసభ స్థానాలు ఉంటే అందులో రెండు బీసీలకు ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ది ప్రదర్శించారు. పార్టీకి విధేయులు ఎంతో మంది ఉన్నారు. కాని బీసీలకు ఇవ్వాలనే పట్టుదలతో వారందరికి కూడా మొండి చేయి చూపించి బీసీలను అందలం ఎక్కించిన ఘనత జగన్ కే దక్కుతుంది.
బీసీల పార్టీలు గా చెప్పుకునే ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు మెజార్టీ స్థానాలను కాని.. కనీసం 50 శాతం స్థానాలను కాని బీసీలకు ఇవ్వలేదు. అన్ని సీట్లు ఇచ్చే దమ్ము ధైర్యం ఏ పార్టీకి కూడా లేదు అనడంలో సందేహం లేదు. బీసీలకు తాము ఉన్నాం అంటూ ఎప్పుడు ఊదరగొట్టే టీడీపీ గతంలో ఎప్పుడు కూడా బీసీలకు సముచిత స్థానం దక్కేలా సీట్లు ఇవ్వలేదు. ఇతర పార్టీల వారు కూడా ఎప్పుడు బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన దాఖలాలు లేవు. అందుకే జగన్ వెంట బీసీలు ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.