Oppo Reno 7Z 5G : ఒప్పో నుండి మ‌రో కొత్త ఫోన్ లాంచ్.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్ ఏంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oppo Reno 7Z 5G : ఒప్పో నుండి మ‌రో కొత్త ఫోన్ లాంచ్.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్ ఏంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 March 2022,5:30 pm

Oppo Reno 7Z 5G :  ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో రెనో సిరీస్‌ను భారత్‌లో ఇటీవలే లాంచ్ చేసింది .ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 7 5జీ , ఒప్పో రెనో 7 ప్రో 5జీ విడుదలయ్యాయి. ఒప్పో రెనో 6 సిరీస్‌కు సక్సెసర్‌గా మంచి స్పెసిఫికేషన్లతో రెనో 7 ఫోన్లు వచ్చాయి. ఒప్పో రెనో 7 ప్రో 5జీ సేల్‌ ఇప్పటికే మొదలుకాగా.. ఒప్పో రెనో 5జీ మొబైల్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 33 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌ బరువు 173 గ్రాములు.కెమెరాకు అధిక ప్రధానత్య ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, మ్యాగ్నటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్ వంటి అధునాత ఫీచర్లు ఈ ఫక్షన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

oppo reno 7z 5g with good specifications

oppo reno 7z 5g with good specifications

Oppo Reno 7Z 5G  : ఫీచ‌ర్స్ బాగున్నాయి..

ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల పుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + కలర్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో కెమెరా సెటప్ ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Sony IMX709 సెన్సార్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది