Palakura Pachadi : పాలకూర పచ్చడి దీనిలోకి కాస్త నెయ్యి వేసి. వేడి వేడి అన్నం తో కలిపి తింటే… ఇక ఆహా అనాల్సిందే…
Palakura Pachadi : పాలకూర దీంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. పాలకూర అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పాలకూరని ఎక్కువగా కూరగా వండుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు దానిని పచ్చడిగా చేసుకొని తిందాం.
కావాల్సిన పదార్థాలు : పాలకూర, చింతపండు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర ,ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎల్లిపాయలు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు ,ఆయిల్, మెంతులు మొదలైనవి. తయారీ విధానం : ముందుగా ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో మెంతులు, మూడు స్పూన్ల ధనియాలు, మూడు స్పూన్ల పచ్చనగపప్పు, మూడు స్పూన్ల మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక కప్పు మిరపకాయలు, కొంచెం కరివేపాకు, వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మూడు కట్టల పాలకూరను సన్నగా తరుక్కొని దానిలో వేసి దానిలో కొంచెం చింతపండు వేసి బాగా దగ్గరకయ్యే వరకు ఉడకనివ్వాలి.
తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులను మిక్సీ జార్ లో వేసి దానిలో కొంచెం రాళ్ల ఉప్పును కూడా వేసి మెత్తని పౌడర్లా చేసుకుని దాంట్లో పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి పేస్టులా చేసుకుని, తర్వాత ఒక కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులను వేసి నాలుగు మిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లిపాయలను కచ్చపచ్చగా దంచి వాటిని కూడా వేసి దానిలో కొంచెం పసుపును వేసి తర్వాత ఈ పచ్చడిని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఆయిల్ పైకి వచ్చేవరకు ఉడకనిచ్చి తర్వాత దించుకోవాలి. అంతే పాలకూర పచ్చడి రెడీ. ఇది కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తింటే ఇక ఆహా అనాల్సిందే.