పంచాయితీ ఎన్నికలు .. బాబుకు జ్ఞానోదయం.. మరి పవన్ పరిస్థితి ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పంచాయితీ ఎన్నికలు .. బాబుకు జ్ఞానోదయం.. మరి పవన్ పరిస్థితి ఏంటి..?

 Authored By brahma | The Telugu News | Updated on :23 February 2021,8:38 am

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎవరి బలం ఏమిటో దాదాపుగా తెలిసిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల సత్తా ఏమిటో అందరికి తెలిసింది. ఎన్నికలు జరుగుతున్నా సమయంలో ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు లెక్కలు ప్రకటించుకున్న కానీ, చివరికి వచ్చే సరికి ఏ పార్టీ సానుభూతి పరులు ఎంత మంది గెలిచారో లెక్కలు తేలాయి.

cbn

చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ

పంచాయితీ ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు గట్టిపట్టు పట్టి మరి ముందుకు వెళ్ళాడు, దానికి కారణం తమకు అనుకూలమైన వ్యక్తి ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్నాడు కాబట్టి తమకు కొంచం ఎడ్జ్ ఉండవచ్చు అనే కోణంలో ఆలోచించాడు. ఆ వ్యక్తి టీడీపీ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న కానీ జనం మాత్రం జగన్ వైపే ఉన్నారనే విషయం తేలిపోయింది. కులపు ఓట్లతో గట్టెక్కిన చోట్ల మినహాయిస్తే.. పల్లెలన్నీ వైసీపీ పాలనలో సంతోషంగా ఉన్నాయి. ఏకగ్రీవాలు కానిచోట్ల వైసీపీతో వైసీపీ అభ్యర్థులే పోటీ పడ్డారు కానీ, టీడీపీకి అవకాశమే ఇవ్వలేదు.

ఇక ముఖ్యంగా కుప్పంలో పార్టీ ఓడిన తర్వాత బాబులో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. వైసీపీ గెలుపుని పరోక్షంగా ఒప్పుకుంటూనే, ప్రజాస్వామ్యం ఓడిందని కొత్త లాజిక్ చెప్పేశారు. పంచాయితీ ఎన్నికల కోసం పట్టుపట్టిన బాబు, అసలు మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల గురించి ఒక్క మాటయినా ఆయన మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం తమ పార్టీ పరిస్థితి ఏమిటో ఆయనకు పూర్తిగా క్లారిటీ వచ్చింది.

pawan kalyan janasena

పవన్ కళ్యాణ్ సంగతేంటి.. !

మరో పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి రాష్ట్రంలో సొంతగా ఒక ఒక పట్టుమని పది సర్పెంచ్ స్థానాలు గెలిచే సరికి ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలు వచ్చినట్లు ఆయన భావిస్తున్నారు. అదే ఊపులో పరిషత్ ఎన్నికల కోసం నానా యాగీ చేస్తున్నారు. ఏకగ్రీవాల పోస్టుమార్టం కోసం ప్రయత్నించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఆల్రెడీ కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నిర్ణయమే ఫైనల్ అని, ఫామ్-10 స్వీకరించిన విజేతల స్థానాలపై ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్ అంటే.. విజేతలకు ఇచ్చిన ఫామ్-10 లకు విలువ లేనట్టే లెక్క.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేష్ విడుదల చేయాలంటూ పట్టుబడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ విషయంలో జరిగిన అన్యాయలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కోర్టు ఏకగ్రీవాల విషయంలో అంత సృష్టమైన తీర్పు ఇచ్చిన కానీ పవన్ కళ్యాణ్ ఏ కోణంలో మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది