Parliament | గోడ దూకి పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించిన ఆగంత‌కుడు.. ఉలిక్కిప‌డ్డ దేశం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Parliament | గోడ దూకి పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించిన ఆగంత‌కుడు.. ఉలిక్కిప‌డ్డ దేశం

 Authored By sandeep | The Telugu News | Updated on :22 August 2025,1:00 pm

Parliament | శుక్రవారం పార్లమెంటు భవనంలోకి ఆగంతకుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే పార్లమెంటు భవనం ఆవరణలో ఉన్న భద్రతా దళాలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆగంతకుడు శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంటులోకి ప్రవేశించాడని భద్రతా వర్గాల సమాచారం.

#image_title

ఉలిక్కిప‌డ్డారు..

అతను రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనం గరుడ్ గేట్ వరకు చేరుకున్నాడు. అయితే పార్లమెంట్ లోపల ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ఈ సంఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. గత సంవత్సరం ఆగస్టులో కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగింది. 20 ఏళ్ల ఒక వ్యక్తి గోడ దూకి పార్లమెంటు అనుబంధ ప్రాంగణంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వ్యక్తి ఎవరు.. ఎందుకు రహస్యంగా పార్లమెంట్ గోడ ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు అనే కోణంలో విచారిస్తున్నారు.. ఏదైనా కుట్రలో భాగంగా ఇలాంటి పని చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.పార్లమెంట్లోకి ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడం ఇది రెండో సారి. దాదాపు రెండేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది