Passport : పాస్ పోర్ట్ కోసం అప్లయి చేస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..!
Passport : భారత పౌరులకు పాస్ పోర్ట్ అనేది చాలా ముఖ్యం. అది ఒక ఐడెంటిటీ కార్డులాగానే కాకుండా.. మన దేశం దాటి వేరే దేశం వెళ్లాలంటే ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ ఉంటేనే వేరే దేశం వెళ్లేందుకు అనుమతిస్తారు. అందుకే.. విదేశాలకు వెళ్లేవాళ్లు ఖచ్చితంగా పాస్ పోర్ట్ ను అప్లయి చేసుకుంటారు. అయితే.. పాస్ పోర్ట్ కోసం పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లి అప్లయి చేసుకోవాల్సి వచ్చేది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్లు అయితే.. ఖచ్చితంగా సిటీకి వెళ్లి పాస్ పోర్ట్ ఆఫీసులో అప్లయి చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల చాలా సమయం వృధా అయ్యేది.

passport can apply at nearest post office
ఇప్పుడు ఆన్ లైన్ లోనూ అప్లయి చేసుకునే వెసులుబాటు ఉంది కానీ.. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా పాస్ పోర్ట్ ఆఫీసుకు అయితే ఒకసారి వెళ్లాలి. అయితే.. ఇక నుంచి పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లకుండానే పాస్ పోర్ట్ ను తీసుకోవచ్చు. అదెలా అంటారా? పదండి తెలుసుకుందాం.
Passport : పోస్టాఫీసుకు వెళ్లి కూడా పాస్ పోర్ట్ సేవలు పొందొచ్చు
తాజాగా పాస్ పోర్ట్ సేవలను పోస్టాపీసులో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇండియా పోస్ట్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి చెప్పింది. పాస్ పోర్ట్ రిజిస్ట్రేషన్ తో పాటు.. పాస్ పోర్ట్ అప్లికేషన్.. పాస్ పోర్ట్ కు చెందిన ఇతర సర్వీసులు అన్నీ దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చాయి. పోస్టాఫీసులో ఉండే కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి పాస్ పోర్టుకు సంబంధించిన సేవలను పొందొచ్చని ఇండియా పోస్ట్ ప్రకటించింది.
పాస్ పోర్ట్ కోసం భారత దేశానికి చెందిన ప్రతి పౌరుడు అప్లయి చేసుకోవచ్చు. పాస్ పోర్ట్ పొందాలంటే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. పాస్ పోర్ట్ కోసం ఆన్ లైన్ లోనూ అప్లయి చేసుకోవచ్చు.
अब अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर पासपोर्ट के लिए पंजीकरण और आवेदन करना सरल हो गया है। अधिक जानकारी के लिए, नज़दीकी डाकघर पर जाएँ। #AapkaDostIndiaPost pic.twitter.com/iHK0oa9lKn
— India Post (@IndiaPostOffice) July 24, 2021
Now it’s easy to register and apply for a passport at your nearest post office CSC counter. To know more, visit the nearest post office. #AapkaDostIndiaPost
— India Post (@IndiaPostOffice) July 24, 2021