Pawan Kalyan : జనసేనా గెలుపు నీదే .. గ్యారెంటీ .. కానీ ఇదొక్కటీ చూస్కో..!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఒక్క చాన్స్ కాదు కదా.. కనీసం ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ జనాలు గెలిపించలేదు. అందుకే 2024 ఎన్నికల్లో అయినా గెలవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. తాజాగా సిద్ధవటంలో జరిగిన కౌలు రైతుల సదస్సులో మాట్లాడారు.
ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. సిద్ధులు తిరిగిన ప్రాంతమే సిద్ధవటం అని అన్నారు. ఒక్క సిద్ధవటం మాత్రమే కాదు.. రాయలసీమ అంతటా సిద్ధులు తిరిగారని తెలిపారు. నేను ఏరోజు పదవుల కోసం పాకులాడలేదు. మార్పు కోసమే నేను ఆలోచించాను. బలమైన ఆలోచనలతోనే నేను 2014 లో జనసేన పార్టీని పెట్టాను. మార్పు కోసమే నేను జనసేన పార్టీని స్థాపించాను ఒకే కుటుంబానికి చెందిన అన్నా, చెల్లి ఇద్దరూ వేర్వేరు పార్టీలు పెట్టుకున్నారు. కేవలం వాళ్ల సామాజిక వర్గం గురించే వాళ్లు ఆలోచిస్తే.. మిగిలిన సామాజిక వర్గాల గురించి ఎవరు ఆలోచిస్తారు.. అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Pawan Kalyan : మాల, మాదిగ, బోయ, కురుబల గురించి ఎవరు ఆలోచిస్తారు?
రాయలసీమలో ఉన్నవాళ్లు కేవలం ఒక సామాజిక వర్గానికే చెందిన వాళ్లు కాదు. మాల, మాదిగ, బోయ, కురుబల గురించి ఎవరు ఆలోచిస్తారు. వీళ్లు ఆలోచించరా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను కులాలకు వ్యతిరేకం. ఒక కులానికి నేను కొమ్ముకాయను. వెనుకబడిన కులాలను గుర్తించి… వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చూడాలి. అగ్రవర్ణాల్లోనూ వెనుకబాటుతనం ఉంది. కానీ.. నేను జనసేన పార్టీని అమ్మడానికి రాలేదు. మానవత్వాన్ని నమ్మే వ్యక్తిని నేను. పేదరికానికి కులం లేదు. కౌలు బాధిత కుటుంబాల్లో రెడ్లే అధికంగా ఉన్నారు.
జగన్ వైసీపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా ఎందుకు వ్యవహరించడం లేదు. తన కేసుల కోసమే కేంద్రం వద్ద ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఒక్కసారి అయినా జనసేనను నమ్మండి. మార్పు కోసం జనసేన ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఆశీస్సులు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ కోరారు.