Pawan kalyan : టీడీపీ లవ్ కాల్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ తేడాగా ఉందేంటి?
Pawan kalyan : చంద్రబాబు నాయుడు ఇటీవల తన సొంత నియోజక వర్గంలో పర్యటించిన సందర్బంగా ఒక కార్యకర్త జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు లవ్ అనేది రెండు వైపుల నుండి ఉండాలి కదా అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీతో పొత్తు ఇష్టం. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్లే చంద్రబాబు నాయుడు అధికారంకు దూరం అయ్యాడు అనేది కొందరి వాదన. అందుకే ఇప్పుడు జగన్ ను ఢీ కొట్టేందుకు సొంతంగా ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన ఈ విషయంలో వస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు ఊహాగాణాలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం. ఈ సమయంలో కొందరి మాటలను పట్టించుకోనక్కర్లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మైండ్ గేమ్ కు బలి అవ్వద్దు అన్నట్లుగా పార్టీ కార్యకర్తలకు పవన్ సూచించాడు. పవన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో కొత్త పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పవన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Pawan kalyan : జనసైనికుల నిర్ణయం అనుసారంగా పొత్తు
ఎన్నికల ముందు జనసేన ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయం మరియు అభిష్టం మేరకే పొత్తుల నిర్ణయం ఉంటుంది. నేను ఒక్కడినే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోను అన్నట్లుగా జనసేన పార్టీ అధినేత పవన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మరింత వేగంగా నిర్వహించాలంటూ ఆయన పిలుపునిచ్చాడు. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నట్లుగా పేర్కొన్న పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్త విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేదు. అందుకే భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి నిర్ణయం ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీ తో పొత్తు పై అస్సలు ఆసక్తి లేదు. మరి మద్యలో పవన్ ఏం చేస్తాడు అనేది చూడాలి.