Pawan Kalyan : సినిమాల్లోనే కాదు మంత్రిగా కూడా పవన్ రికార్డ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : సినిమాల్లోనే కాదు మంత్రిగా కూడా పవన్ రికార్డ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,8:00 pm

Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలిసిందే. ఉమ్మడి ఏపీ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు ఎంతోమంది పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్న వారు తలపండిన వారు కూడా పనిచేశారు. ఐతే పంచాయతీ మంత్రిగా ఎవరి స్టైల్ లో వారు తమ వంతుగా శాఖ కోసం పనిచేశారు. పంచాయతీ రాజ్ శాఖ అందేది చాలా కీలకమైంది. గ్రామీణ పాంతం అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తాయి. దేశంలో గ్రామీ ప్రాంతమే ఎక్కువగా ఉంటాయి.

దాదాపు 100 కి 70 శాతం మంది పనిచేస్తుంటారు. అందుకే ఈ శాఖని పవన్ తీసుకున్నారు. ఐతే అధికారం చేపట్టినప్పటి నుంచి పవన్ పంచాయతీ శాఖ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి కేవలం దాని మీదే దృష్టి పెట్టారు. ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ పనిచేస్తున్నారు. ఈ శాఖలో తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. రివ్యూల మీద రివ్యూలు చేస్తూ శాఖ పరమైన కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఐతే గతంలో ఎంతోమంది చేసినా సరే ఇలా నిర్ణయాత్మక మైన పనులు చేయలేదు.

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : రికార్డ్ స్థాయిలో సభలు..

పంచాయతీలు అభివృద్ధి కోసం ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తుందగా వాటికి అందరు స్పందిస్తున్నారు. ఇది పవన్ చేస్తున్న కొత్త ప్రక్షాళన అని చెప్పొచ్చు. ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు.. దేశంలో కూడా ఎక్కడా పంచాయతీ శాఖ కోసం ఇలా ఎవరు చేయలేదు. ఈ నెల 23న ఏకంగా 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అన్నది ఒక గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఈ సభలు గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే పనుల గురించి తెలుసుకోవడం వాటికి కావాల్సిన ఆమోదముద్ర వేయడం కోసమని తెలుస్తుంది. అంతేకాదు గ్రామాలలో ఉపాధి అవకాశాలు అందించే విధంగా గ్రామ సభలు ఏర్పటు చేస్తున్నారు. వంద రోజుల ఉపాధి కల్పన మీద అవగాహన పెంచడమే కాకుండా ఉపాధి హామీ పనులకు గ్రామ సభల్లో ఆమోదిస్తున్నారు. ఇక 2024-25 ఆర్ధిక సంవత్స‌రంలో ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం అమోదం తెలిపేలా ఇంకా భారీగా గ్రామాలలో ఉపాధిని అందించేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ సభలకు ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలిపేలా అధికారులను సూచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది