Pawan Kalyan : బిగ్ బాస్ లో క్యూట్ అమ్మాయికి MLA టికెట్ ఇవ్వబోతోన్న పవన్ కళ్యాణ్?
Pawan Kalyan: బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. ప్రస్తుతం తెలుగులో ఆరో సీజన్ నడుస్తోంది. 10 వారాలు గడిచాయి. 10 వ వారం బ్యూటీ క్వీన్ వాసంతి ఎలిమినేట్ అయింది. నిజానికి తనది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీనే కానీ.. తను సినీ ఇండస్ట్రీలో సెటిల్ కావాలని అనుకుంది. అందుకే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది వాసంతి. ఆ తర్వాత తను పలు సినిమాల్లో నటించి అలరించింది. తాజాగా తనకు బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం వచ్చింది. దాదాపు 10 వారాలు ఎలాగోలా బిగ్ బాస్ హౌస్ లో
ఉన్న వాసంతి చివరకు 10 వ వారం ఎలిమినేట్ అయింది. తను ఎలిమినేట్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి.. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పార్టీ జనసేన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. పవన్ కళ్యాణ్ అభిమానిని కావడంతో.. తనను ఇన్ని రోజులు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారని వాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా వాసంతి చెప్పుకొచ్చింది. అయితే.. వాసంతి సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో రాణించాలని అనుకుంటోందని..
Pawan Kalyan : రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న వాసంతి
తన తాజాగా వ్యాఖ్యలతో అర్థం అవుతోంది. జనసేన పార్టీ తరుపున తను రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ పార్టీ తరుపున పోటీ చేయడం ఓకే.. మరి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ రెడీ అంటూ సమాధానం చెప్పింది వాసంతి. అయితే.. తెలుగులో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కేవలం బిగ్ బాస్ ద్వారా వాసంతికి వచ్చింది. ఇదే పాపులారిటీతో వాసంతి మరిన్ని సినిమాల్లో అవకాశం పొందుతుందా? లేక నిజంగానే రాజకీయాల్లోకి వెళ్తుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.