Pawan kalyan : మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు – జగన్ కి చుక్కలు చూపించే నిర్ణయం తీసుకున్న పవన్ ?
Pawan kalyan కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు నగారా మోగింది. ఏకగ్రీవానికి వైసీపీ నేతలు కసరత్తు చేస్తుంటే.. పోటీకి సై అంటూ ప్రధాన పార్టీలు కాలుదువ్వుతున్నాయి. ఐతే జనసేన-బీజేపీ అభ్యర్థిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రజాప్రతినిథి మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి ఇటీవల తెరపడింది. దీంతో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ సైతం బద్వేలు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని, మంత్రులు, సీనియర్ నేతలు తరచు నియోజకవర్గంలో పర్యటించాలని సూచించడం కూడా ఈ ఎన్నికను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఇక్కడ గెలిచి వైసీపీకి షాకివ్వాలని చూస్తుండగా.. జనసేన-బీజేపీ కూటమి కూడా సై అంటోంది.
Pawan kalyan ఏకగ్రీవానికి చెల్లుచీటీ
గతంలో ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరైనా చనిపోతే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకే ఏకగ్రీవంగా పదవి ఇవ్వాలని తీర్మానించారు. ఈ సంప్రదాయం కొంతకాలం బాగానే సాగింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏకగ్రీవంగా ఇచ్చే సంప్రదాయానికి కొన్ని పార్టీలు పాటించే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో ఉపఎన్నిక తప్పని సరిగా మారింది. ఈ కారణంగానే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కొంతకాలంగా రాజకీయంగానే కాకుండా ఉప ఎన్నికపై కూడా మౌనంగానే ఉన్నారు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం వామపక్షాలు, కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో నేరుగా పొత్తు లేకపోయినా అవగాహన కుదుర్చుకోవాలంటున్నట్లు వినికిడి. కమ్యుబనిస్టు పార్టీలను నేరుగా కలుపుకుని వెళ్తూ.. ఈ ఎన్నిక ద్వారా కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Pawan kalyan అభ్యర్థులెవరో..
ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైసీపీ ఖరారు చేసింది. జనసేన-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ఇరు పార్టీ అగ్రనేతలు కూర్చొని త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారు. బై పోల్ బరిలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ఉంచాలని కూటమి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి.., ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నట్లు సమాచారం. బద్వేలు అభ్యర్థిపై రెండుపార్టీలు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీ తరపున అభ్యర్థి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.