AP Pensions : బ్రేకింగ్.. ఏపీలో అందని పించన్లు, కారణం అదేనా…?
AP Pensions : ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెన్షన్ ల విషయంలో చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఇచ్చిన మాట ప్రకారం సిఎం జగన్ పెన్షన్ సొమ్ముని కూడా పెంచారు. ఇక ప్రతీ నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. అయితే ఈసారి ఆ పించన్ సొమ్ము అందకపోవడంతో వృద్ధుల్లో ఆందోళన మొదలయింది. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ సొమ్ము అందకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
ఇందుకోసం గానూ ఏపీ సర్కార్ ప్రతి నెల చివరి తేదీ లో 1500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నది. నిన్న సాయంత్రం బ్యాంకుల వద్దకు వెళ్లినప్పటికీ ఈ సొమ్ము ఇంకా అందకపోవడంతో వాలంటీర్ లు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో కొంత మొత్తం మాత్రమే నగదుని బ్యాంకులు ఇచ్చాయి.
దీనితో వాలంటీర్ లు చేతులు ఎత్తేసారు. ఈరోజు పెన్షన్ సొమ్ము ఇవ్వలేమని వాలంటీర్లు మెసేజ్ లు పంపుతున్నారు. నిధులు కొరత తోనే పెన్షన్ సొమ్ము రాలేదు అంటున్న కొంతమంది అధికారులు… వెంటనే అందుతాయని కంగారు వద్దని చెప్తున్నారు. సాంకేతిక సమస్య కారణంగా బ్యాంకుల సర్వర్లు పనిచేయకపోవడంతో పెన్షన్ సొమ్ము విడుదల కాలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.