PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన అమౌంట్ రిటర్స్ చేయాలంటే.. అలాగే ఈ కేవైసీ అప్డేట్ కోసం జులై 31 వరకు
PM Kisan Yojana : కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి ప్రోత్సాహం నిమిత్తం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాయం ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాదితో ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 11 విడతల వారీగా నిధులు జమ చేసింది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే అప్డేట్ చేసుకున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇక ఈ కేవైసీ అప్డేట్ ఇంకా చేసుకోని రైతుల కోసం జులై 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ నిధులు పొందడానికి అర్హులు కానట్లే. అయితే ఈ పథకాన్ని అనర్హులు కూడా వినియోగించుకుటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా నగదు పొందుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఇక వారికి నోటీసులు కూడా పంపుతున్నట్లు చెబుతోంది. అయితే ముందుగానే పీఎం కిసాన్ నగదును రిటర్న్ చేయాలనుకునే వారు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. రిఫండ్ ఆన్‌లైన్ ఆనే ఆప్షన్ ఎంచుకుని మనీ రిఫండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ తర్వాత ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఇక గెట్ డేటాపై క్లిక్ చేస్తే రిఫండ్ అమౌంట్‌కు ఎలిజిబిలిటీ లేదు అనే ఆప్షన్ కనిపిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. రీఫండ్ అమౌంట్ కనిపిస్తే డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.
PM Kisan Yojana : వీళ్లకు వర్తించదు..
అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అనర్హులుగా ప్రకటించింది. డాక్టర్లు, ఇంజినీర్లు, సీఏ, లాయర్లు, ఆర్కిటెక్స్ వంటి వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందటానికి అనర్హులు. అలాగే రాజ్యంగబద్ధమైన పదవి కలిగిన వారు కూడా ఈ స్కీమ్‌కు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తించదు. అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్ పొందే వారు కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందలేరు. మాజీ మంత్రులు, మేయర్లు, లోక్ సభ రాజ్యసభ సభ్యులు, డిస్ట్రిక్ పంచాయితీ ప్రెసిడెంట్, ఎమ్మేల్యే, ఎంఎల్‌సీ వంటి వారు కూడా పీఎం కిసాన్ బెనిఫిట్ పొందలేరు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుకు కూడా ఈ పథకం వర్తించదు.