PM Kisan Scheme : ఈ పని చేస్తే చాలు.. రైతుల ఖాతాల్లో రూ.4 వేలు జమ అవుతాయి.. ఏం చేయాలో తెలుసా?
PM Kisan Scheme : రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చిన విషయం తెలుసు కదా. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా రైతులను ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని పొందొచ్చు. ప్రతి సంవత్సరం మూడు సార్లు ఒక దఫా రూ.2 వేల చొప్పున ఆరువేలు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 13 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు త్వరలో 14వ ఇన్ స్టాల్ మెంట్ రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఏప్రిల్ నుంచి జులై మాసాలకు చెందిన ఈ ఇన్ స్టాల్ మెంట్ త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది.
అయితే.. ప్రతి దఫా రెండు వేలు మాత్రమే పొందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ పథకంలో ఉన్న రైతుల్లో కొందరికి రూ.2 వేలు కాకుండా రూ.4 వేలు కూడా పొందే చాన్స్ ఉంది. అయితే.. ఇది అందరికీ కాదు. కేవలం కొందరు రైతులకు మాత్రమే ఈ అవకాశం. కేంద్రం 13వ ఇన్ స్టాల్ మెంట్ ను గత ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది కానీ.. కొందరు రైతులకు ఆ ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు ఇంకా అందలేదు. అటువంటి రైతులు 14వ ఇన్ స్టాల్ మెంట్ తో కలిసి రూ.4 వేలు పొందొచ్చు.
PM Kisan Scheme : దాని కోసం ఏం చేయాలి?
తమకు 13వ ఇన్ స్టాల్ మెంట్ ఎందుకు రాలేదో రైతులు ముందు తెలుసుకోవాలి. కొందరు అకౌంట్ నెంబర్స్ తప్పుగా ఇస్తారు. లేదా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ లో తప్పు ఉండొచ్చు. లబ్ధిదారుల పేరు మ్యాచ్ కాకపోవడం ఇలా పలు తప్పిదాల వల్ల డబ్బులు పడని వారు కొందరు ఉన్నారు. వాళ్లు ఎందుకు తమకు డబ్బులు పడలేదో తెలుసుకుంటే.. ఆ తప్పును త్వరగా సరిదిద్దుకుంటే 14వ విడత డబ్బులతో పాటు 13వ విడత డబ్బులు కూడా వాళ్ల అకౌంట్లలో పడిపోతాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలకు pmkisan.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. 14వ ఇన్ స్టాల్ మెంట్ ను కేంద్రం.. జులైలోగా ఇచ్చే చాన్స్ ఉంది. అందుకే అప్పటిలోగా రైతులు ఎక్కడ పొరపాటు జరిగిందో చెక్ చేసుకుంటే రూ.2 వేలకు బదులు రూ.4 వేలు పొందొచ్చు.