PM kisan : రైతన్నలకు శుభవార్త .. పీఎం కిసాన్ రూ. 12 వేలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం..!
ప్రధానాంశాలు:
PM kisan : రైతన్నలకు శుభవార్త ..
పీఎం కిసాన్ రూ. 12 వేలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం..!
PM kisan : కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద మూడు విడతలతో 2000 చొప్పున 6 వేలను రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. అయితే ఈ పథకానికి ఉన్న ఆదరణ చూసి పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని ఆరువేల నుంచి 12000 కి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమాన్ నిధి మొత్తాన్ని 6000 రూపాయలకు బదులుగా 12 వేల రూపాయలకు పెంచనున్నారు. దీంతోపాటు బీజేపీ తన మెనిఫెస్టోలో రైతుల కోసం ఎన్నో ప్రకటనలు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ రెండు రాజకీయ పార్టీలు రైతులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నాయి.
రైతులను సంతృప్తి చేయాలని తమ మేనిఫెస్టోలో రైతుల కోసం ప్రత్యేకంగా ప్రకటనలు చేశాయి. బిజెపి మేనిఫెస్టోలో పిఎం కిసాన్ యోజన కింద 12000 ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి రైతు విద్య ప్రోత్సాహక పథకం కింద రైతుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. అలాగే రైతులకు గోధుమల ఎంఎస్పి పై 200 బోనస్గా ఇచ్చి క్వింటాకు 2700 చొప్పున గోధుమలను కొనుగోలు చేస్తామన్నారు. మిల్లెట్, జొన్నలను కూడా ఎంఎస్పి వద్ద కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయబడతామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన రైతుల భూములను తగిన పరిహారం అందజేస్తామన్నారు.
కాంగ్రెస్ బిజెపి గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బిజెపి తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకా రాలేదు అవి కూడా ఇవే ప్రకటనలు కావచ్చు. కాంగ్రెస్ మేనిఫెస్టో 60 పేజీలతో ఉంటుందని అందులో రైతుల కోసం అనేక పథకాలు ఉంటాయని చెబుతున్నారు. కుటుంబ పెద్ద కు ప్రతి సంవత్సరం 10,000 ఇవ్వబడుతుందని, ఉజ్వల పథకం కింద 500 కి గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుందని, 15 లక్షల విపత్తు నివారణ భీమా ఇస్తామని, పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిఎస్ చట్టాన్ని అమలు చేస్తామని, ఆవుపేడ కిలో రెండు చొప్పున కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటుందని తెలుస్తుంది.