PM Kisan Scheme : అన్నదాతలారా.. నెలకు రూ. 3,000 పెన్షన్ పొందేందుకు ఇలా చేస్తే సరి
PM Kisan Scheme : పీఎం కిసాన్ పథకం కింద అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈ పథకం కింద 11వ విడత డబ్బులు ఈ నెల 31 న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ పథకం రైతులకు బాగా ఉపయోగపడుతుంది. అసంఘటిత రంగంలో ఉన్న అన్నదాతలకు ఈ పథకం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పథకంతో పాటుగా కేంద్రం అన్నదాతల కోసం పెన్షన్ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టింది.
పీఎం శ్రమ యోగి మాన్ దన్ అని ఆ పథకానికి కేంద్రం పేరును ఖరారు చేసింది. ఈ పథకం కింద అర్హులైన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 3,000 పెన్షన్ ను అందజేస్తోంది. 60 సంవత్సరాల వయసు దాటిన అన్నదాతలకు పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం తెలియజేసింది. పీఎం కిసాన్ పథకం కోసం అన్నదాతలు అన్ని సర్టిఫికెట్లను సమర్పించి ఉంటారు కావున ఈ పథకం కోసం అదనంగా సర్టిఫికెట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లతోనే ఈ పథకం వర్తిస్తుంది.ఈ పథకం పొందాలనుకునే అన్నదాతలు ముందుగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమచేయాలి.
PM Kisan Scheme : 60 ఏళ్ల తర్వాత డబ్బులు
అలా అన్నదాతలు జమ చేసినపుడు కేంద్ర ప్రభుత్వం కూడా సగం మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి జమ అవుతుంది. రూ. 55 నుంచి రూ. 200 వరకు రైతులు కట్టాల్సి ఉంటుంది. రైతులు తమ వయసు ఆధారంగా ఈ ప్రీమియం ను కట్టాల్సి ఉంటుంది. రైతులు 60 సంవత్సరాల వరకు ఈ ప్రీమియంను కడితే 60 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుంది. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు అధికారులు కోరుతున్నారు.