Robo Electric Scooters : రోబో ఈ స్కూటర్.. మడిచి బ్యాగ్ లో పెట్టేయొచ్చు తెలుసా..
Robo Electric Scooters : పెట్రోల్ ధరలు తీవ్ర స్థాయిలో మండిపోవడంతో వాహనదారులు బండ్లు బయటకి తీయాలంటేనే జంకుతున్నారు. కొంతమంది ప్రయాణాలు చేయడమే మానేస్తున్నారు. సామాన్యుల ఆదాయం పెరగడం లేదు కానీ.. ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. అందుకే పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో అయితే సైకిల్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సిటీల్లో అయితే వెహికల్స్ లో ప్రాయాణం షేర్ చేసుకుంటున్నారు. ఒకే ఆఫీస్ వారు.. ఒకే ప్రాంతానికి వెళ్లవల్సిన వారు ఒకే వెహికల్స్ లో వెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. మరికొంత మంది బస్సుల్లో వెళ్తూ భారం తగ్గించుకుంటున్నారు.
అందుకే చాలా మంది ఇంధనరహిత వెహికల్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, సైకిల్స్ వాడటానికి ఇష్టపడతున్నారు. అందుకు తగ్గట్లు వాహన కంపెనీలు కూడా పోటీపడుతూ వెహికల్స్ రెడీ చేస్తున్నాయి.దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. పైగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటివి అవసరం లేకపోవడంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. హీరో, ఒకినావా, ఓలా, బజాజ్ వంటి ప్రముఖ కంపెనీలు పోటీ పడుతూ మార్కెట్లోకి వెహికల్స్ ను విడుదల చేస్తున్నాయి.
అయితే ఇందుకు వినూత్నంగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరిని ఆకట్టుకుంటోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..కాగా పోయిమో ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్ రొబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ సంయుక్తంగా తీసుకువచ్చిన ఈ స్కూటర్ తెగ సందడి చేస్తోంది. అయితే ఈ స్కూటర్ కి పెట్రెల్ అవసరం లేదు.. పార్కింగ్ అక్కర్లేదు. మనం వెళ్లవల్సిన ప్రాంతం చేరుకోగానే గాలి తీసీ మడిచి బ్యాగ్ లో పెట్టుకోవచ్చు.కాగా ఈ స్కూటర్ కేవలం 5 కిలోల బరువు ఉంటుంది. ఇందులో సాప్ట్ రొబోటిక్స్ టెక్నాలజీతో రూపొందించారు. అయితే దీనిపై ఒక్కరికే ప్రాయాణం సాధ్యం అవుతుంది. వైర్ లెస్ పవర్ సిస్టమ్ ద్వారా ఉపయోగించి ఈ వెహికిల్ ను రూపొందించారు.