YS Jagan : జగన్ స్టిక్కర్ చించిందని కుక్కపై పోలీసు కేసు వీడియో వైరల్..!!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన యుద్ధం పెతందారులతో అని పూర్తిగా తన ఓటు మొత్తం లేబర్ పైన ఆధారపడినట్లు.. జగన్ పరోక్షంగా చెప్పడం జరిగింది. దీంతో నాయకులను నిత్యం ప్రజలలో ఉండే రీతిలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్నటిదాకా “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వము నుండి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికలలో కూడా జగన్ ని ఆదరించాలని కోరుతూ రావటం జరిగింది. ఈ “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరు బట్టి వచ్చే ఎన్నికలలో టికెట్ ఉంటుందని జగన్ చెప్పటం జరిగింది. ఇదే సమయంలో “మా నమ్మకం జగనే” అనే కొత్త కార్యక్రమం ఇటీవల చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలన గురించి అభిప్రాయాలను సేకరిస్తూ వారి యొక్క ఫీడ్ బ్యాక్ తీసుకొని… స్టిక్కర్ అతికించాలో లేదో..
ఇంటి యజమానినీ అడిగి వైసీపీ నేతలు తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో సీఎంఓ కార్యాలయానికి మిస్డ్ కాల్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అతికించిన స్టిక్కర్ నీ ఓ కుక్క చింపేయడం జరిగింది. ఈ వీడియో వైసిపి ప్రత్యర్థి పార్టీలు తెగ ట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సంఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరగడంతో స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కుక్క స్టిక్కర్ పీకటం.. ఆడవాళ్లు పోలీస్ కంప్లైంట్ చేయటం.. దానిపై కేసు ఫైల్ చేయటంపై జనాలు నవ్వుకుంటున్నారు.