కోడిగుడ్లను దొంగిలించిన పోలీస్‌.. ఉద్యోగం నుంచి స‌స్పెండ్‌.. వీడియో..!

0
Advertisement

police theft eggs పోలీసులు అంటే ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాలి. స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాలి. అవ‌స‌రం అయితే ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాలి. సేవ చేయాలి. కానీ ప్ర‌జ‌ల‌కు చెందిన వ‌స్తువుల‌ను దొంగిలించ‌రాదు. ఈ విష‌యాన్ని మ‌రిచిన ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఓ చిరువ్యాపారి నుంచి కోడిగుడ్ల‌ను దొంగిలించాడు. ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అయ్యాడు. ఈ సంఘ‌ట‌న పంజాబ్‌లో చోటు చేసుకుంది.

police head constable theft eggs from road side vendor
police head constable theft eggs from road side vendor

పంజాబ్‌లోని చండీగ‌డ్‌లో ఉన్న ఫ‌తేగ‌డ్ సాహిబ్ టౌన్‌లో హెడ్ కానిస్టేబుల్ ప్రీత్‌పాల్ సింగ్ రోడ్డు  police theft eggs ప‌క్క‌న ద్విచ‌క్ర వాహ‌నంపై ఉన్న కోడిగుడ్ల‌ను దొంగిలించాడు. ఓ చిరువ్యాపారి ఆ వాహ‌నాన్ని రోడ్డు ప‌క్క‌న ఆపి వేరే నిమిత్తం ప‌క్క‌కు వెళ్లాడు. అదే స‌మ‌యంలో అదును చూసిన ప్రీత్‌పాల్ సింగ్ ఆ వాహ‌నానికి క‌ట్టి ఉన్న ట్రే ల నుంచి కోడిగుడ్లను దొంగిలించాడు. అయితే అదే స‌మ‌యంలో ఎవ‌రో మొబైల్ ఫోన్ ద్వారా ఆ తంతును చిత్రీకరించారు.

ప్రీత్‌పాల్ సింగ్ కోడిగుడ్ల‌ను దొంగిలించిన వీడియోను మొబైల్ ఫోన్ ద్వారా ఎవ‌రో చిత్రీక‌రించి దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది. విష‌యం పంజాబ్ పోలీసు ఉన్న‌తాధికారుల వ‌ర‌కు వెళ్లింది. దీంతో వారు వెంట‌నే స్పందించారు. ప్రీత్‌పాల్ సింగ్‌ను ఉద్యోగం నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే అత‌నిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ క్ర‌మంలో పంజాబ్ పోలీస్ అధికార‌క ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అవును మ‌రి.. ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన పోలీసే ప్ర‌జ‌ల‌ను భ‌క్షించాల‌ని చూస్తే ఇలాగే జ‌రుగుతుంది.

Advertisement