KCR : పారిపోయి మరీ దొరికిపోయిన టీ‌ఆర్‌ఎస్ పెద్దలు.. కే‌సీఆర్ డ్రామా మొత్తం బయటపడింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : పారిపోయి మరీ దొరికిపోయిన టీ‌ఆర్‌ఎస్ పెద్దలు.. కే‌సీఆర్ డ్రామా మొత్తం బయటపడింది..!

KCR : మునుగోడు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అనే అంశం ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన ఎర కేసుకు సంబంధించి సెట్ దర్యాప్తు చేస్తోంది. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో పోలీసులు ఈ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 November 2022,7:00 pm

KCR : మునుగోడు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అనే అంశం ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన ఎర కేసుకు సంబంధించి సెట్ దర్యాప్తు చేస్తోంది. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లిన సిట్ టీమ్ ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ల ఇళ్లు, వాళ్ల సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

అయితే.. సిట్ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొందరు నిందితులు పరారవుతున్నారట. అందులో ఒక డాక్టర్ కూడా ఉన్నారట. ఆ డాక్టర్ అడ్రస్ తెలుసుకొని మరీ అతడి ఇంటికి వెళ్లేలోపు అతడు పరారయినట్టు తెలుస్తోంది. అతడు రామచంద్రభారతి స్వామీజీకి చాలా సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే తిరుపతిలో సింహయాజులు ఆశ్రమంతో పాటు.. హర్యానాలోని రామచంద్రభారతి స్వామీజీ  ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అలాగే.. హైదరాబాద్ కు చెందిన నందకుమార్ ఇళ్లలో ఇవాళ అధికారులు సోదాలు నిర్వహించారు.

police search began in other states also in trs mlas purchase case KCR

police search began in other states also in trs mlas purchase case KCR

KCR : తిరుపతి, హర్యానాలోనూ సోదాలు జరిపిన సిట్ అధికారులు

ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా నందకుమార్ కర్ణాటకకు చెందిన ఓ మంత్రితో, ఓ ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో కర్ణాటకకు వెళ్లి ఆ మంత్రి, ఎమ్మెల్యే ఇంట్లోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారట. మరోవైపు నిందితులకు గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లి వాళ్లను కూడా పట్టుకోవడం కోసం పోలీసుల సాయాన్ని సిట్ అధికారులు తీసుకోనున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది