posani krishna murali : పవన్ కళ్యాణ్‌పై పోసాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు.. చెప్పుతో కొడతానంటూ హెచ్చరిక..!
posani krishna murali: రెండ్రోజుల నుంచి సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోసాని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను దూషించడంతో పాటు పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు పోసానిని టార్గెట్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయనపై దాడిచేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్లదాడికి దిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సినీ నటుడు పోసాని పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ప్లే చేసి మరీ ఆయన్ను పోసాని విమర్శించారు. పవన్ కల్యాన్ పలు సందర్భాల్లో మాట్లాడిన క్లిప్పింగ్స్ ప్లే చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఓసారి తాను సీఈసీ చదివినట్లు, మరోసారి ఎంఈసీ చదివినట్లు, మరోసారి ఎంపీసీ చదివినట్లు వీడియోల్లో కనిపిస్తుంది. అనంతరం ఆ వీడియోలను ఉద్దేశించి ఒకేసారి ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ చదవడం సాధ్యమేనా అని పవన్ కల్యాణ్‌ను పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.
posani krishna murali : నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను : పోసాని కృష్ణమురళి
పవన్ కల్యాణ్ అన్న మాటలకు తప్పు లేదు కాని తాను మాట్లాడిన మాటలకు తప్పు ఉందా అని పోసాని ప్రశ్నించారు. తనను పవన్ అభిమానులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మాటలను మెగాస్టార్ చిరంజీవి ఖండిచొచ్చు కదా అని పోసాని అన్నారు. అయితే, తాను 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, దాడులకు భయపడబోనని పోసాని చెప్పారు. ఈ క్రమంలోనే జనసేనానిపై పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్‌ను తానే చెప్పుతో కొడతానని, మహా అయితే తనను ఆయన అభిమానులు చంపేస్తారని, అంతకంటే ఏం చేయలేరని చెప్పారు. పవన్ తన అభిమానులకు డబ్బులిచ్చి వారిని తనపై దాడికి ఉసిగొల్పారని పోసాని ఆరోపించారు. రాజకీయంగా తనను విమర్శిస్తే భరిస్తానని, కానీ, తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోనని పోసాని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..