Post Office : ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే… ఐదేళ్లలో 14 లక్షలు పొందవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office : ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే… ఐదేళ్లలో 14 లక్షలు పొందవచ్చు…

Post Office : మనం కష్టపడి సంపాదించిన డబ్బు కచ్చితంగా దాచిపెట్టుకోవాలి. లేదంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడతాం. కాబట్టి డబ్బును దాచి పెట్టుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో అత్యవసరమైన వాటికి, పిల్లల భవిష్యత్తుకు దాచుకున్న డబ్బులు ఉపయోగపడతాయి. డబ్బులు దాచుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుపరిచింది. పోస్ట్ ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులో అనేక పథకాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో నేషనల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,6:00 am

Post Office : మనం కష్టపడి సంపాదించిన డబ్బు కచ్చితంగా దాచిపెట్టుకోవాలి. లేదంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడతాం. కాబట్టి డబ్బును దాచి పెట్టుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో అత్యవసరమైన వాటికి, పిల్లల భవిష్యత్తుకు దాచుకున్న డబ్బులు ఉపయోగపడతాయి. డబ్బులు దాచుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుపరిచింది. పోస్ట్ ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులో అనేక పథకాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్(NSC) ఒకటి.

ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపును కూడా పొందే సదుపాయం ఉంటుంది. NSC ని సీనియర్ సిటిజన్స్ కూడా నెలవారి ఆదాయాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో మైనర్లు కూడా చేరవచ్చని తెలిపారు. అలాగే ఇద్దరు సంయుక్తంగా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఎన్ ఎస్ సి వడ్డీ రేటు ప్రతి త్రైమాసికములు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత త్రైమాసికంలో రేటు 6.8% ఉంది.

Post Office scheme earn 14 lakhs in 5 years

Post Office scheme earn 14 lakhs in 5 years

ఈరోజు వెయ్యి రూపాయలకు ఈ పథకంలో పొదుపు చేస్తే ఈ పెట్టుబడి ఐదేళ్లలో 1389కి పెరుగుతుంది. ముఖ్యంగా పెట్టుబడికి గరిష్ట పరిమితి లేనందున ఇందులో ఎంత మొత్తం అయినా పొదుపు చేయవచ్చు. ఈరోజు 10 లక్షలు పొదుపు చేస్తే ఐదేళ్లలో 13.89 లక్షలకు చేరుకుంటుంది. ఈ పథకంలో 1.5 లక్షల పెట్టుబడి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఎన్ ఎస్ సి మెచ్యూరిటీ అయిన తర్వాత వడ్డీ పై పన్ను విధిస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ముందుగా తీసుకోవాలంటే కొన్ని సందర్భాల్లోనే అనుమతి ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది