Post Office : ఈ పథకంలో రూ.50 పెట్టుబడితో… రూ.35 లక్షలు పొందవచ్చు… అర్హతలు ఇవే…
Post Office : ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బులు పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఇలా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో వచ్చే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అయితే పొదుపు చేయడం ద్వారా మంచి రాబడిని పొందడం కోసం ఎందులో పొదుపు చేస్తున్నామనేది కూడా ముఖ్యమే. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఆచితూచి పొదుపు పథకాలను ఎంచుకోవాలి. అందులో ఒకటి ఇండియా పోస్ట్ గ్రామ సురక్ష యోజన పథకం. ఈ పథకంలో రోజుకు రూ.50 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి 35 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండడానికి ఇండియా పోస్ట్ అనేక పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి రిస్క్ ఉండదు. మంచి ఆదాయం కూడా ఉంటుంది.
అలాంటి పథకాల్లో ఒకటి గ్రామ సురక్ష యోజన. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన పథకం అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీకి మార్చుకుని అదనపు ఫీచర్ ఉంది. దీనికింద పాలసీదారు 55, 58, 60 సంవత్సరాల వయసు వరకు తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో పొదుపు చేయాలంటే 19 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇందులో 10,000 నుంచి 10 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. పొదుపు చేయడం ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత రుణ సౌకర్యం కూడా ఉంది. ప్రీమియం చెల్లించే వయసు 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకోవచ్చు.
రోజుకి 50 రూపాయలు పొదుపు చేస్తూ 35 లక్షల పొందే అవకాశం ఉంటుంది. గ్రామ సురక్ష యోజన లబ్ధిదారులు ఎటువంటి రిస్క్ లేకుండా ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ పెద్ద మొత్తంలో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారులు ప్రతిరోజు 50 డిపాజిట్ చేసి 35 లక్షల వరకు రిటర్న్ పొందవచ్చు. ఇఃదుకు ప్రతిరోజు 50 చొప్పున ప్రతినెలా పాలసీ కింద 1515 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత 34.60 లక్షల ఆదాయం పొందవచ్చు. ఒక వ్యక్తి 55 సంవత్సరాల కాలానికి 31,60,000, 58 సంవత్సరాలకు 33,40,000, 60 సంవత్సరాల కాలానికి 34.60 లక్షలు మెచ్యూరిటీని లాభం పొందుతారు.