Post Office : అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్… ఈ స్కీమ్ లో ప్రతి ఏడాది లక్ష కు పైగా పొందవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office : అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్… ఈ స్కీమ్ లో ప్రతి ఏడాది లక్ష కు పైగా పొందవచ్చు…

Post Office : ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బును దాచుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వలన భవిష్యత్తులో కలిగి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే డబ్బులు దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ చాలా బెస్ట్. పోస్ట్ ఆఫీస్ లో రకరకాల పథకాలుఉన్నాయి. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు ఉన్నాయి. ఒకప్పుడు లెటర్ లకి పరిమితమైన పోస్ట్ ఆఫీస్ లు ప్రస్తుతం బ్యాంకుల వల్లే అన్ని సేవలను అందిస్తున్నాయి. పోస్టాఫీస్ లు మరింతగా మెరుగుపరచడంలో వివిధ […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,7:00 am

Post Office : ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బును దాచుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వలన భవిష్యత్తులో కలిగి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే డబ్బులు దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ చాలా బెస్ట్. పోస్ట్ ఆఫీస్ లో రకరకాల పథకాలుఉన్నాయి. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు ఉన్నాయి. ఒకప్పుడు లెటర్ లకి పరిమితమైన పోస్ట్ ఆఫీస్ లు ప్రస్తుతం బ్యాంకుల వల్లే అన్ని సేవలను అందిస్తున్నాయి. పోస్టాఫీస్ లు మరింతగా మెరుగుపరచడంలో వివిధ రకాల సేవలను పొందుతున్నారు ప్రజలు. పోస్టాఫీస్ పెట్టుబడి కి మంచి ఆదరణ ఉంది.

ఇది మనీ గ్యారెంటీతోపాటు మంచి రాబడిని కూడా ఇస్తుంది పోస్టాఫీస్ లో మంచి రాబడి వచ్చే పథకాలు ఉన్నాయి. ఈ స్కీం లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం 1,11,000 పొందుతారు. పోస్టాఫీస్ కి చెందిన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం పై పెట్టుబడిదారులు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ పథకంలో 7.4% వడ్డీ ప్రయోజనం పొందుతారు. దీనితో పాటు ప్రభుత్వం ప్రతి త్రైమాసికములో వడ్డీ రేటు సమీక్షిస్తుంది. ఇందులో వడ్డీ మొత్తం కూడా మారవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో మంచి రాబడితోపాటు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Post Office Scheme to earn 111000 per yearly

Post Office Scheme to earn 1,11,000 per yearly

దీని మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు. అయితే పెట్టుబడిదారులు ఈ పథకాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. 80c ఆదాయపు పన్ను కింద 1.5 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదే సమయంలో మీరు పొందే వడ్డీ 50 వేల కంటే ఎక్కువ ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఖాతాదారుడు 15 లక్షలు ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7.4% వడ్డీ పొందవచ్చు. దీంతో ఖాతాదారుడు ప్రతి త్రైమాసికంలో 27,750 పొందుతాడు. అదే సమయంలో వార్షిక మొత్తం 1,11,000 అవుతుంది. మీరు ఉమ్మడి ఖాతా ను తెలిస్తే గరిష్ట పెట్టుబడి 30 లక్షల పెరుగుతుంది. పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేసిన తర్వాత వడ్డి 2.2 లక్షలకు రెట్టింపు అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది