PMAY Scheme : దేశంలోని నిరాశ్రయులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభత్వం ప్రారంభించిన పథకమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన . 2022 నాటికి అల్ప ఆదాయ కుటుంబాలు, మధ్య ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారి కోసం 2 కోట్ల గృహాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించింది.ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ ఆదాయపు వర్గాలకు చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన వారందరూ ఈ స్కీమ్ కు అర్హులు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కాంపోనెంట్ కింద, హోమ్ లోన్ ఎంపిక చేసుకునే లబ్దిదారులకు రూ.2.67 లక్షల వరకు వడ్డీ రాయితీ వస్తోంది.
ఈ ప్రయోజనాలను లబ్దిదారులు ఇల్లు కొనేటప్పుడు లేదా నిర్మాణంలో ఉన్నప్పుడు పొందవచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ మార్కును చేరుకోవాలనుకుంటోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ రెండు భాగాలుగా ఉంది. ఒకటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, రెండు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్.ఇల్లులేని వారికి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారికి పక్కా ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ హౌసింగ్ ప్రాజెక్టు ఖర్చును ఇరు ప్రభుత్వాలు పంచుకుంటాయి. పీఎంఏవై పథకం కింద లబ్దిదారులను సామాజిక ఆర్థిక, కుల గణన నుంచి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా గుర్తిస్తారు. పీఎంఏవై కింద వర్తించే అన్ని ఇళ్ల రుణాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రయోజనాలను లబ్దిదారులకు బదిలీ చేసింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వివరాలు
అధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in/
టోల్ ఫ్రీ నెంబర్లు 1800-11-6163 – హుడ్కో
1800 11 3377, 1800 11 3388 – ఎన్‌హెచ్‌బీ
సూచనలు, ఫిర్యాదుల కోసం grievance-pmay@gov.in
ఆఫీసు అడ్రస్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, నిర్మాణ్ భవన్, న్యూఢిల్లీ – 110011
కాంటాక్ట్ 011 2306 3285, 011 2306 0484
ఈమెయిల్ – pmaymis-mhupa@gov.in
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.