PMAY Scheme : సొంతిటి క‌ల.. నెర‌వేర్చుకోండి ఇలా.. పీఎంఏవై స్కీమ్ వెంట‌నే అప్లై చేసుకోండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PMAY Scheme : సొంతిటి క‌ల.. నెర‌వేర్చుకోండి ఇలా.. పీఎంఏవై స్కీమ్ వెంట‌నే అప్లై చేసుకోండి

 Authored By mallesh | The Telugu News | Updated on :10 April 2022,12:30 pm

PMAY Scheme : దేశంలోని నిరాశ్రయులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భత్వం ప్రారంభించిన పథకమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన . 2022 నాటికి అల్ప ఆదాయ కుటుంబాలు, మధ్య ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారి కోసం 2 కోట్ల గృహాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు సంవ‌త్స‌రాల క్రితం ప్రారంభించింది.ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ ఆదాయపు వర్గాలకు చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన వారందరూ ఈ స్కీమ్ కు అర్హులు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కాంపోనెంట్ కింద, హోమ్ లోన్ ఎంపిక చేసుకునే లబ్దిదారులకు రూ.2.67 లక్షల వరకు వడ్డీ రాయితీ వస్తోంది.

ఈ ప్రయోజనాలను లబ్దిదారులు ఇల్లు కొనేటప్పుడు లేదా నిర్మాణంలో ఉన్నప్పుడు పొందవచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ మార్కును చేరుకోవాలనుకుంటోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ రెండు భాగాలుగా ఉంది. ఒకటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, రెండు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్.ఇల్లులేని వారికి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారికి పక్కా ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.

pradhan mantri awas yojana gramin new list online apply form home loan

pradhan mantri awas yojana gramin new list online apply form home loan

PMAY Scheme : లబ్దిదారులకు రూ.2.67 లక్షల వరకు వడ్డీ రాయితీ

రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ హౌసింగ్ ప్రాజెక్టు ఖర్చును ఇరు ప్రభుత్వాలు పంచుకుంటాయి. పీఎంఏవై పథకం కింద లబ్దిదారులను సామాజిక ఆర్థిక, కుల గణన నుంచి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా గుర్తిస్తారు. పీఎంఏవై కింద వర్తించే అన్ని ఇళ్ల రుణాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రయోజనాలను లబ్దిదారులకు బదిలీ చేసింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వివ‌రాలు
అధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in/
టోల్ ఫ్రీ నెంబర్లు 1800-11-6163 – హుడ్కో
1800 11 3377, 1800 11 3388 – ఎన్‌హెచ్‌బీ
సూచనలు, ఫిర్యాదుల కోసం grievance-pmay@gov.in
ఆఫీసు అడ్రస్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, నిర్మాణ్ భవన్, న్యూఢిల్లీ – 110011
కాంటాక్ట్ 011 2306 3285, 011 2306 0484
ఈమెయిల్ – pmaymis-mhupa@gov.in

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది