Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ దూరం అవ్వడంతో వైకాపాకు నష్టమా?
Prashant Kishor : గత ఎన్నికల్లో వైకాపా తో కలిసి పని చేసిన రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా కు సేవలు అందించడం లేదు. ఆ విషయాన్ని స్వయంగా పార్టీ వెల్లడించింది. ప్రశాంత్ కిషోర్ ఈ సారి వైకాపా కోసం పని చేయడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించాడు. అయితే మరో సంస్థతో వైకాపా ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు కూడా వస్తున్నాయి. 2018 ఎన్నికల పరిస్థితులతో పోలిస్తే ఈసారి చాలా తేడా ఉంది. గత ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహం కంటే కూడా జనాల్లో జగన్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన కలగడం వల్ల వైకాపాకు పాజిటివ్ ఓట్లు దక్కాయి.ఈసారి కచ్చితంగా మరోసారి గెలిపించాలని ఉద్దేశంతో జనాలు ఉన్నారు.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవ్వాలి అంటే మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అనేది జనాల్లోకి పాతుకు పోయింది. ఒకప్పుడు ప్రభుత్వ పనులు జరగాలంటే రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వయంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి ప్రభుత్వ పనులు చేసి పెడుతున్నారు.ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం ప్రజలకు చేరువ అయింది. అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ఆదర్శవంతంగా జగన్ ప్రభుత్వం నిలిచింది.
అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి జగన్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ఈ విషయమై ఆలోచనలో ఉన్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. అందుకే ప్రశాంత్ కిషోర్ ని పక్కకు పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఆయన సలహాలు సూచనలు లేకున్నా కూడా కచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైకాపా ఘన విజయాన్ని సాధించి, రెండోసారి అధికారం దక్కించుకోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ప్రశాంత్ కిషోర్ కూడా అదే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారని సమాచారం అందుతోంది.