Bank Interest Rates : బ్యాంకు యూజర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లను పెంచిన ప్రైవేటు బ్యాంకు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank Interest Rates : బ్యాంకు యూజర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లను పెంచిన ప్రైవేటు బ్యాంకు

 Authored By mallesh | The Telugu News | Updated on :24 May 2022,8:20 am

Bank Interest Rates : డబ్బులు.. ప్రపంచంలో ఎటువంటి వారికైనా సరే డబ్బులు చాలా అవసరం. కూటి కోసమే కోటి విద్యలు అని పెద్దలు చెప్పారు. అటువంటి కూటి కోసం ప్రతి ఒక్కరూ అనేక కష్టాలు పడుతుంటారు. ఎన్ని కష్టాలు భరించైనా సరే తమకు కావాల్సిన డబ్బులను సంపాదించుకుంటూ ఉంటారు. అలా డబ్బులను కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకులు వారి కోసం వడ్డీని అందజేస్తాయి. ఈ వడ్డీ రేట్లు అనేవి ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి . కాబట్టే కొంత మందికి ఎక్కువ డబ్బులు వస్తే కొంత మందికి మాత్రం బ్యాంకుల్లో వేసినా కానీ తక్కువ డబ్బులు వస్తుంటాయి.

ఇలా ఎక్కువ తక్కువ డబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు. ఈ వడ్డీ రేట్ల గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఇస్తారనే విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేసే బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తూ ఉంటారు.ఓ ప్రైవేటు బ్యాంకు ప్రస్తుతం వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో అనేక మంది కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. రెండేళ్ల కాలపరిమితితో వేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై కర్ణాటక బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది.

Private bank raising interest rates

Private bank raising interest rates

Bank Intrest Rates : వడ్డీ రేట్లను పెంచేసిన ప్రైవేటు బ్యాంకు

ఈ నిర్ణయంతో అనేక మంది కస్టమర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ వడ్డీ రేట్లు మే 21 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ పెంచిన వడ్డీ రేట్లు అమలవుతాయి. అంతకంటే ఎక్కువ అమౌంట్ ను డిపాజిట్ చేస్తే ఈ పెంపు వర్తించదు. ఇంతకు ముందు ఇదే బ్యాంకులో రెండేళ్ల కాలపరిమితితో డబ్బులు జమ చేస్తే 5.1 శాతం వడ్డీని అందించేవారు. ఇప్పుడు 15 బేస్ పాయింట్ల మేర పెంచారు. ప్రస్తుతం ఈ బ్యాంకు రెండేళ్ల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లకు కొత్తగా ప్రవేశపెట్టిన వడ్డీ రేట్లు అంటే 5.25 లభిస్తుంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది