KCR : ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్‌కు లాభమా.. నష్టమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్‌కు లాభమా.. నష్టమా?

 Authored By mallesh | The Telugu News | Updated on :23 December 2021,8:30 pm

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా తనకు, పార్టీకి లాభం చేకూరాలని ఆలోచిస్తుంటారు. అందుకోసం చాలా రోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభిస్తారు. సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటారు. అంతా తనకు అనుకూలంగానే ఉందని తెలిస్తేనే అప్పుడు డేర్‌గా స్టెప్ వేస్తారు. కేసీఆర్ మొదటి సారి సీఎం అయినప్పుడు ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతిపక్షాలకు కనీసం ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. తన వ్యూహాలతో ఇతర పార్టీలను ఇరుకున పెట్టి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్జీతో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళతారని రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొన్నటివరకు టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దీనిపై స్పందించగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ నేరుగా స్పందించారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. ఇప్పుడే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను సిద్ధం చేయాలని, ఇతర పార్టీల నుంచి కీలక నేతలను, ఉద్యమకారులను పార్టీలో చేర్చుకోవాలని బీజీపీ స్టేట్ ఛీప్ బండి సంజయ్‌కు దిశానిర్దేశం చేశారట.. ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేం. ఆయనకు ఉండే సమాచారం ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటారు.

profit or loss for kcr it goes for early elections

profit or loss for kcr it goes for early elections

KCR: కేసీఆర్ మదిలో ఏముంది?

దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. కేసీఆర్ ఈాసారి ముందస్తుకు వెళ్లనని చెప్పారు. అది ప్రతిపక్షాలను తప్పుదారి పట్టించడానికి లేదా ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లకుండా కేసీఆర్ వేసిన ఎత్తుగడ అనుకోవచ్చు.. కేసీఆర్ ఈసారి కూడా ముందస్తుకు వెళ్లితే ఆ పార్టీకే ఎక్కువ నష్టం కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే దళితబంధు ఇవ్వలేదు. రైతు బంధు కూడా లేట్ అయ్యింది. బీసీ బంధు, మైనార్టీ బంధు అని కొత్త పథకాలు తెచ్చిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈసారి అంత తేలికగా ఓట్లు రాలవని కేసీఆర్ కు కూడా తెలిసిపోయింది. చూడాలి మరి కేసీఆర్ ముందస్తుకు జై కొడతారా లేదా అని..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది