Prudhvi Raj : మొన్నటి వరకు పవన్ కళ్యాణ్‌పై నీచంగా మట్లాడిన పృథ్విరాజ్.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీలోకే…!
Prudhvi Raj : రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేం. ఒక పార్టీలో ఉన్న నాయకులు కొద్ది రోజులకి ఇంకొక పార్టీలోకి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ జంపింగ్ ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ జనసేనలోకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కమెడియన్ గా పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమేటేటింగ్ లో.. కామెడీ టైమింగ్ లో ఆయన మార్క్ డిఫరెంట్ గా ఉంటుంది. పృథ్విరాజ్ ఇండస్ట్రీలో కొనసాగినంత వరకూ బాగానే ఉంది. కాని రాజకీయాల్లోకి వెళ్ళడం ఆయన జీవితాన్నే మార్చేసింది. ముందుగా వైసీపీలో చేరి ఆపై ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన నటుడు పృథ్వీ ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్య రీతిలో తిరిగి టాలీవుడ్‌కు చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. జనసేన జెండా వేసుకుంటాడు..
తాజాగా జనసేన పార్టీలో చేరేందుకు సినీ నటుడు పృథ్విరాజ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు సినీ నటుడు పృథ్విరాజ్. దీంతో త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్నారు పృథ్విరాజ్. అతి త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక సొంత నియోజకవర్గమైన తాడేపల్లిగూడెం నుండి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఇటీవల వైసీపీ క్యాంపును ఉగ్రవాద శిక్షణ శిబిరంతో పోల్చిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తాను గొప్పవాడినన్న గర్వం పెరిగిందని, దీంతో ఎవరినీ లెక్క చేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబు వంటి వారిని కూడా అనరాని మాటలు అన్నానని, అయితే, వాళ్లెవరూ సీరియస్‌గా తీసుకోలేదని, సహృదయంతో తనను అర్థం చేసుకున్నారని అన్నారు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుకు చెప్పానని అన్నారు.