MLC Elelections: పీవీ కూతురు ఎందుకు నామినేషన్ వేయలేకపోయారు? చివరి నిమిషంలో కేసీఆర్ హడావుడి ఏంటి?
MLC Elections : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏం చేసినా.. ఆలోచించి చేస్తారు. ఆయన ఆలోచన విధానం.. మనకన్నా ఓ పదేళ్లు ముందుంటుంది. లోతుగా ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. అందుకే ఆయన్ను రాజకీయాల్లో పండిన నేత అంటారు. రాజకీయాల్లో ఆయన్ను బీట్ చేసేవారు లేరు. ఆయనలా ఎత్తులకు పైఎత్తులు వేసే వాళ్లు లేరు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఈనేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
ఓవైపు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించినా.. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించి.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ప్రకటించకుండా మిగితా పార్టీలకు షాకిచ్చారు కేసీఆర్.
అయితే.. నామినేషన్ రెండు రోజుల్లో ముగుస్తుందనగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి పేరును ప్రకటించారు. ఆమెకు కూడా విషయం తెలపడంతో.. సురభి వెంటనే నామినేషన్ వేయడం కోసం అన్ని పత్రాలను సమకూర్చుకున్నారు. నామినేషన్ కు రెండు రోజులే సమయం ఉండటంతో.. అన్ని పత్రాలను తీసుకెళ్లినప్పటికీ.. నామినేషన్ ఫార్మాట్ సరిగ్గా లేదని.. ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్ ను తిరస్కరించారు.
MLC Elections : ఓడిపోయే సీటుకు నిలబెట్టి.. పీవీని అవమానిస్తారా?
చివరి నిమిషంలో ఆమె పేరును ఖరారు చేసి.. అది కూడా ఓడిపోయే సీటుకు ఆమెకు అవకాశం ఇచ్చి.. కేసీఆర్ పీవీని అవమానిస్తున్నారని.. ఇదేనా కేసీఆర్ పీవీకి ఇచ్చే గౌరవం అంటూ ఓవైపు పీవీ అభిమానులు, ప్రతిపక్షాలు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిచే చాన్స్ లేదని ముందే కేసీఆర్ కు తెలిసిందని.. అందుకే.. చివరి నిమిషంలో పీవీ కూతురుకు టికెట్ కన్ఫమ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
నామినేషన్ రెండు రోజుల్లో ముగుస్తుందనగా.. హడావుడి చేసి ఆమె పేరు ప్రకటించడం వెనుక ఏదో జరుగుతోందని.. ఇవాళ ఒక్కరోజులో నామినేషన్ వేయకపోతే.. టీఆర్ఎస్ అభ్యర్థి ఉండరని.. ఇన్నిరోజులు తాపీగా నిద్రపోయి.. ఇప్పుడు హడావుడి చేసి కేసీఆర్ సాధించేదేంటంటూ విమర్శలు వస్తున్నాయి.
ఏది ఏమైనా.. పీవీకి ప్రాధాన్యం ఇవ్వకున్నా పర్లేదు కానీ.. పీవీని అగౌరవ పరిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ పీవీ అభిమానులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చూద్దాం మరి.. కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో.. త్వరలోనే తెలుస్తుంది.