KCR : కేసీఆర్ రాజకీయం.. పీవీకి అవమానం జరగబోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ రాజకీయం.. పీవీకి అవమానం జరగబోతుందా..?

 Authored By brahma | The Telugu News | Updated on :22 February 2021,9:21 am

తెలంగాణలో రాజకీయ ఎత్తుల వేయటంలో కేసీఆర్ ను మించిన నేత మరొకరు లేరని అందరు అనే మాట. ఆ మాటను నిజం చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేసి అటు ప్రతిపక్షాలనే కాకుండా ఇటు సామాన్య జనాలను సైతం షాక్ కు గురిచేశాడు.

surabhi vanidevi

పీవీ కూతురు రంగప్రవేశం

హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తెరాస తరుపున ఎవరిని పోటీకి దించాలి అనే దానిపై కేసీఆర్ గత కొద్దీ రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇలాంటి స్థితిలో అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవీని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం… పోటీకి ఆమె అంగీకరించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. సురభి వాణిదేవి… రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. అయితే పీవీ నరసింహారావుకు ఎక్కడా లేనంత గౌరవం ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్.. శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కమిటీలో సురభి వాణిదేవికి కీలక స్థానం ఇచ్చారు…

congress mlc jeevan reddy shocking comments on cm kcr

congress mlc jeevan reddy shocking comments on cm kcr

KCR : కష్టమే సుమీ.. !

నిజానికి హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం తెరాస కు అనుకూలమైనది కాదు. గతంలో ఉద్యమ వేడి ఉన్నప్పుడే… ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ను ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఓడిపోయారు. ఈ ధపా అక్కడ పోటీచేయాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కేటీఆర్ కోరిన కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు. గతంలో పోటీచేసి ఓడిపోయిన దేవీప్రసాద్ ను మరోసారి పోటీచేయాలని కోరితే, ఒక్కసారి ఓడించారు సరిపోలేదా..? మరోసారి నేను ఆ సాహసం చేయలేనని తేల్చి చెప్పాడు. అలాంటి స్థానంలో సురభి వాణిదేవీని నిలబెట్టటాన్ని ఏ కోణంలో చూడాలి.

రాజకీయ చదరంగంలో పీవీ కూతురు.. !

పీవీ కూతురు సురభి వాణిదేవీని ఈ స్థానంలో పోటీ చేయించటాన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. అటు భాజపా, ఇటు కాంగ్రెస్ ను కార్నర్ లోకి తోయడానికి వేసిన ఎత్తుగడగా చూడాలి దీనిని. కాంగ్రెస్ పార్టీ పిఎమ్ గా పని చేసిన నాయకుడి కుమార్తె. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకునపడుతుంది. ఇక భాజపా సంగతి కూడా అలాగే వుంటుంది. భాజపా అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణి కి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ వుంటుంది. అలాగే పివి అంటే వర్గాలు, పార్టీలకు అతీతంగా అభిమానించేవారు వున్నారు. పట్టణ ఓటర్లు, యువతలో కూడా పివి అంటే అభిమానించేవారు ఇప్పటికీ వున్నారు. వీరు సహజంగా భాజపా అంటే కూడా అభిమానంతో వుంటారు. వీరందరినీ డైలామాలో పడేయడం లేదా ఈ ఓట్లలో చీలిక తీసుకరావడం కేసిఆర్ ప్లాన్ కావచ్చు.

నిజానికి గత ఆగస్టులో గవర్నర్ కోటాలో మూడు స్థానాలు భర్తీ చేశారు. అప్పట్లోనే పీవీ కుమార్తె పేరును టీఆర్ఎస్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగాపోటీకి నిలబెట్టారు. ఇది పీవీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేస్తోంది. తన రాజకీయ పబ్బం కోసం పీవీ కుటుంబాన్ని రాజకీయంగా వాడుకోవడానికి సీఎం కేసీఆర్ సిద్దమయ్యాడు అంటూ కొన్ని వర్గాల నుండి అసహనం వ్యక్తం అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది