Bird Flu : నల్లగొండలో బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి..!
ప్రధానాంశాలు:
Bird Flu : నల్లగొండలో బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి
Bird Flu : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం ఏర్పడింది. గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి చెందాయి. పౌల్ట్రీ యజమాని మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టాడు. మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000 కోళ్లు మరణించాయని, దీంతో 4 లక్షల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు….

Bird Flu : నల్లగొండలో బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి..!
మరోవైపు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఐదు రోజుల వ్యవధిలో 231 నాటుకోళ్లు మృతిచెందాయి. మరోక ఘనటలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధి పైనంపల్లి వద్ద పాలేరు ఏరులో కోళ్ల కళేబరాలు కలకలం రేపాయి. శుక్రవారం ఏటి వైపు ఉన్న తమ పొలాలకు వెళ్లిన రైతులకు ప్రవాహానికి కొట్టుకుపోతున్న కోళ్లు కనిపించాయి.
బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్న తరుణంలో కోళ్ల కళేబరాలు దర్శనమివ్వడం గ్రామస్థులను ఆందోళనకు గురిచేసింది. పశు వైద్యాధికారులు మాట్లాడుతూ కోళ్లకు వ్యాధులు సోకినట్లు అనుమానాలుంటే వాటి నమూనాలను సేకరిస్తామని, కోళ్లను పెంచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.