Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Authored By Sam C | The Telugu News | Updated on : 28 September 2025, 2:00 pm

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘రాజాసాబ్’ ఒకటి. చాలా కాలం తర్వాత ప్ర‌భాస్ హారర్ కామెడీ జానర్ చేస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో అదరగొట్ట‌గా, ఇందులో ప్ర‌భాస్ బుజ్జిగాడు, యోగి సినిమాల్లో మాదిరిగా క‌నిపించాడు.

#image_title

ఇక త‌గ్గేదే లే..

ఇక టీజర్ ప్రభాస్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, స్టైలింగ్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కొత్త పోస్టర్ షేర్ చేశారు. ”భయం ద్వారాలు తెరుచుకుంటున్నాయి… దైర్యం ఉంటే ప్రవేశించండి” అంటూ ట్రైలర్ పై మరింత ఆసక్తిని పెంచారు.

ఏకంగా 3 నిమిషాల 30 నిడివితో ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజా సాబ్ గ్లిమ్ప్స్ వీడియోనే 2 నిమిషాలపై నిడివితో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో దీనికి ముఞ్చి ట్రైలర్ ఉండబోతుందని నెట్టింట టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు!

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి