Raksha Bandhan : అక్క తమ్ముళ్లు, అన్నా చెల్లెలు రాఖీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే రాఖీ పండగ రానే వచ్చింది. ఈ రాఖీ పండుగ సోదరీ సోదరీమణుల మధ్య ప్రేమ, విడదీయరాని బంధానికి చిహ్నం. ఈ పండుగ సోదరీ సోదరీమణులకు ఎంతో ప్రత్యేకమైనది. కనుక సోదరుడు రాఖీ కట్టిన సోదరికి ఏదో ఒక కానుక ఇవ్వాలని అనుకుంటాడు. అయితే మార్కెట్లో తక్కువ ధరలో స్మార్ట్ వాచ్లు దొరుకుతున్నాయి. కనుక మీ సోదరీమణులకు ఈ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయండి. అయితే ఈ వాచ్ ల ద్వారా ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజో వాచ్ డి రూ.5000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది ఒకటి.1.8 ఇంచెస్ డిస్ప్లేను కలిగి ఉంది. 150 కి పైగా డైల్స్ ఈ స్మార్ట్ వాచ్ సొంతం. ఐదు రకాల కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ వాచ్ ధర 2999 రూపాయలుగా ఉంది. అలాగే నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4: ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3499 గా ఉంది. ఇందులో బ్రైట్ డిస్ప్లే తో ఎండలో నిలబడ్డ వాచెస్ డిస్ ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ తో పాటు 150 కి పైగా క్లౌడ్ ఆధారిత యూనిటెడ్ వాచ్ ఫేసులు అందుబాటులో ఉన్నాయి.

బోట్ ప్రీమియా: ఈ రాఖీకి మీ సోదరికి కానుకగా ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వాచ్ ధర 4499 గా ఉంది. అమోఎల్ఈడి డిస్ప్లే ఈ వాచ్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇన్ స్పీకర్ మైక్రోఫోన్ మెటాలిక్ డిజైన్తో డిజైన్ చేశారు. అలాగే ఈ వాచ్ ఐపి67 డస్ట్, చమట, స్లాష్ రెసిస్టెన్స్ తో అందుబాటులో ఉంది. రియల్ మీ వాచ్ 2 లైట్ ఈ వాచ్ ధర 4999. దీనిలో ఐదు ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ అందించారు. ఎస్ పిఓ రెండు సెన్సార్ తో మరెన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. డిసో వాచ్ ఆర్: 5000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచెస్ లో ఇది ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ వాచ్ ధర 3999గా ఉంది. ఇందులో 1.3 ఇంచెస్ అల్ట్రా షార్ప్ అమోఎల్ఈడి డిస్ప్లే ఉంది. 110 కి పైగా వాచ్ ఫేసెస్ ను అందించారు.