Rakhi Festival : రాఖీ పండుగను హిందువులు కాక ఇంకా… ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakhi Festival : రాఖీ పండుగను హిందువులు కాక ఇంకా… ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Rakhi Festival : రాఖీ పండుగను హిందువులు కాక ఇంకా... ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా...?

Rakhi Festival : ప్రతి సంవత్సరం కూడా raksha bandhan రాఖీ పండుగ వస్తూనే ఉంటుంది. తోబుట్టువులందరూ కూడా రాఖీ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ తీరిక లేక వెళ్ళని సోదరీ సోదరులు ఆ రోజున ఒక దగ్గర కలుసుకొని ఆనందంగా తమ బంధాన్ని చేసుకుంటారు. ప్రేమ, ఆప్యాయతల మధ్య కుటుంబ వాతావరణము నెలకు ఉంటుంది. అక్కా చెల్లెల్లు, అక్క తమ్ముళ్లు జరుపుకునే ఈ మహోత్తమైన పండుగ భారతదేశంలో హిందువులు మాత్రమే జరుపుకుంటారా, లేదా ఇతర మతాల ప్రజలు కూడా జరుపుకుంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా… మరి దీని గురించి తెలుసుకుందాం.. రాఖీ పండుగ అన్నదమ్ములతో, అక్క చెల్లెలు మధ్య ఉన్న అమూల్యమైన పవిత్రమైన సంబంధానికి చిహ్నం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు.ఈ పండుగ రోజు సోదరి తన సోదరునికి మహోన్నత శిఖరాలకు ఏదగాలని కోరుకుంటూ రాఖీని కడుతుంటారు. రాఖీ పండుగను ప్రధానంగా దేశ విదేశాలలో ఉన్న హిందూ మతస్తులందరూ కూడా జరుపుకునే పండుగ. ఈరోజు నా సోదరీమణులు తమ సోదరుని మనికట్టుకి,తమ ప్రేమని, ఆప్యాయాన్ని పంచుతూ రక్షణ ఇవ్వమని కోరుతూ రక్షాబంధన్ ని కడతారు.

Rakhi Festival రాఖీ పండుగను హిందువులు కాక ఇంకా ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా

Rakhi Festival : రాఖీ పండుగను హిందువులు కాక ఇంకా… ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?

Rakhi Festival  రాఖీ పండుగ హిందువులు ఎందుకు జరుపుకుంటారు

రాఖీ పండుగ ప్రధానంగా హిందూ పండుగ. అయితే, హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడు, రాక్షసులతో యుద్ధంలో ఉన్నపుడు, ఇంద్రుడి భార్య శచి తన భర్త రక్షణ కోరుతూ శ్రీకృష్ణుని వద్దకు చేరుకుంది. ఒక దారం కట్టి తన భర్తని రక్షించమని కోరింది. అప్పటినుంచి, రాఖీ కట్టడం ఒక ఆచారంగా మారింది. అందువల్ల హిందూమతంలో రక్షాబంధన్ రోజున సోదరునికి రాఖీ కట్టి సోదరుని రక్షణ కోరుతారు.

Rakhi Festival  రాఖీ పండుగ హిందువులతోపాటు

రాఖీ పండుగను హిందువులతో పాటు సిక్కు మతం, జైన మతానికి చెందిన వారు కూడా జరుపుకుంటారు.ఈరోజు నా విష్ణుకుమార్ 700 మంది జైన సన్యాసులను రక్షించడాని నమ్ముతారు.అందుకే జైన సమాజం ప్రజల రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అంతే కాదు.. ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. రక్షాబంధన్ పండుగ మతపరమైన సరిహద్దులకు అతీతం గా ప్రేమ రక్షణ కోరుకుంటూ,తోబుట్టుల మధ్య బంధానికి చిహ్నంగా మారింది. రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం రక్షిస్తానని సోదరుడు వాగ్దానం చేస్తాడు.ఈ పండుగ సోదరీ సోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది.వారి మధ్య ప్రేమను పెంపొందించడానికి ఇది ఒక మార్గంగా కూడా పరిగణించడం జరిగింది. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రాఖీ పండుగ నాడు అన్నా చెల్లెలు,అక్క తమ్ముళ్లు సంతోషంగా తమ ఆనందాలను పంచుకుంటారు. ఇది దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రాఖీ పండుగ మన దేశంలో ఐక్యతలకు చిహ్నం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది