Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !
ప్రధానాంశాలు:
Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు – సోదరి మధ్య బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడుతూ, వారిని రక్షణగా కోరుతారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9, 2025 (శనివారం) న జరుపుకోనున్నారు. విశేషం ఏమిటంటే, 95 ఏళ్ల తర్వాత అంటే 1930లో ఏర్పడిన శుభయోగాలు ఈ ఏడాది మళ్లీ కలిసొస్తున్నాయి. ఇదే తేదీ, ఇదే తిథి, అదే నక్షత్రం, అదే యోగాలు కలసి రావడం ఇదో అరుదైన సందర్భంగా పరిగణించవచ్చు.

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !
Raksha Bandhan : అరుదైన తేది..
రాఖీ పండుగ ప్రత్యేకతలు చూస్తే.. శ్రావణ పౌర్ణమి తిథి ప్రారంభం: ఆగస్టు 8, మధ్యాహ్నం 2:12 గంటలకు, ముగింపు: ఆగస్టు 9, మధ్యాహ్నం 1:24 గంటలకు. ఇక భద్ర కాలం ప్రారంభం: ఆగస్టు 8, మధ్యాహ్నం 2:12 గంటలకు, ముగింపు: ఆగస్టు 9, తెల్లవారుజామున 1:52 వరకు ఉంటుంది. రాఖీ కట్టడానికి శుభ సమయం – ఆగస్టు 9న ఉదయం 5:21 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు .ఈ రాఖీ పండుగ రోజు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి.
సౌభాగ్య యోగం – ఆగస్టు 9న ఉదయం నుంచి ఆగస్టు 10 తెల్లవారుజామున 2:15 వరకు. శోభన యోగం – సౌభాగ్య యోగం తరువాత ప్రారంభమవుతుంది. సర్వార్థ సిద్ధి యోగం – ఆగస్టు 9 ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 2:23 వరకు, శ్రావణ నక్షత్రం – మధ్యాహ్నం 2:23 వరకు, దీనితో పాటు కరణం, బవ, బాలవ కలయిక యాదృచ్చికంగా సంభవించాయి. ఇలాంటి శుభయోగాలలో లక్ష్మీ-నారాయణ పూజ చేసి, రాఖీ కడితే మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. 1930లో కూడా రాఖీ పండుగ ఆగస్టు 9న, శనివారం రోజునే వచ్చింది .అదే తిథి, అదే యోగాలు, అదే నక్షత్రం, అదే కరణాలు ఏర్పడ్డాయి, కేవలం 5 నిమిషాల తేడాతో పౌర్ణమి తిథి ప్రారంభమైంది. అప్పట్లో కూడా సౌభాగ్య యోగం, శ్రావణ నక్షత్రం ఉండటంతో ఈ సంవత్సరంతో అదే శుభం కలిగి ఉంది.