Rakul Preet Singh : అమాంతం అలా వెనక్కి వంగేసింది.. రకుల్ ప్రీత్ మామూల్ది కాదు!
Rakul Preet Singh రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ అంటే ప్రాణమిస్తుంది. నిత్యం వర్కవుట్లు చేయమన్నా హాయిగా చేస్తూ ఉంటుంది. రోజులో 24 గంటలు వర్కవట్లు చేయడానికైనా రకుల్ సిద్దంగానే ఉంటుంది. అలాంటి రకుల్ ప్రీత్ వర్కవుట్లు, యోగాలతో నిత్యం ఫుల్ బిజీగా ఉంటుంది. తన ఫిట్ నెస్ మీద, డైటింగ్ మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తుంటుంది. అలాంటి రకుల్ తన యోగా గురువు అన్షుకతో కలిసి చేసే ఆసనాలు మామూలుగా ఉండవు. కరోనా సమయంలోనూ యోగాతో రకుల్ రచ్చ చేసింది.

Rakul Preet Singh Yoga Session
కరోనా వచ్చి క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనూ రకుల్ ఫుల్ వర్కవుట్లు చేసింది. యోగాసనాలు వేస్తూ తన డైలీ రొటీన్ వర్క్స్‌ను చేసింది. అలాంటి రకుల్ ప్రీత్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో తన యోగా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. యోగాను సెలెబ్రిటీలందరూ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా ఓ శిక్షకులను కూడా పెట్టుకుంటున్నారు. సెలెబ్రిటీలకు యోగా శిక్షణలో ఎక్కువగా అన్షుక పేరు వినిపిస్తుంటుంది.
Rakul Preet Singh ఆసనంతో రకుల్ ప్రీత్ రచ్చ

Rakul Preet Singh Yoga Session
రకుల్ ప్రీత్ యోగా గురువు అన్షుక. రకుల్ తాజాగా అమాంతం వెనక్కి వంగేసింది. అలా ఒక్కసారిగా బెండ్ అయిన ఫోటోను షేర్ చేయడంతో అంతా అవక్కయ్యారు. అయితే యోగా కంటే ఇలా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండటం కాదని చెప్పింది. యోగా అంటే అదో ధ్యాస, సాధించాలనే కోరిక ఉండటం అని చెప్పుకొచ్చింది. ఇక రకుల్ వేసిన యోగాసనాన్ని చూసి గురువు అన్షుక మురిసిపోయింది. ఆసనం, కొటేషన్ రెండూ అదిరిపోయాయ్ అన్నట్టుగా కామెంట్ చేసింది.