Ramoji Rao : షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ రావు? వాళ్లంతా రోడ్డున పడాల్సిందే?
Ramoji Rao : రామోజీ రావు గురించి తెలుసు కదా. ఆయన్ను అందరూ తెలుగు మీడియా మొఘల్ అని చెబుతుంటారు. తెలుగు మీడియాలో ఆయన్ను మించినోడు లేడు. ఒక్క మీడియా అనే కాదు… రామోజీ రావు ఏ వ్యాపారం ప్రారంభించినా.. అందులో సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అవ్వలేదు. ఓటమి ఎరుగని ధీరుడు రామోజీ రావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ దగ్గర్నుంచి.. ఈనాడు, ఈటీవీ, ప్రియ, రామోజీ ఫిలి సిటీ.. ఇలా పలు రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి వేల మందికి ఉపాధి కల్పించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామోజీ రావు.
కొన్ని దశాబ్దాలుగా ఈనాడు పత్రిక రెండు రాష్ట్రాల్లోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. తెలుగులో ఎన్నో పత్రికలు వచ్చాయి.. పోయాయి కానీ.. ఈనాడు పత్రికను మాత్రం ఏవీ బీట్ చేయలేకపోయాయి. ఇప్పటికీ.. ఈనాడు నెంబర్ వన్ గా ఉంది అంటే దానికి కారణం ఆ పత్రిక పాటించి విలువలు.
అయితే.. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలం అయింది. రామోజీ కంపెనీలపై కూడా ఆ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో రామోజీ రావు కూడా పునరాలోచనలో పడాల్సి వచ్చింది.
ఇప్పటికే కరోనా సమయంలో ఈనాడు స్టాఫ్ ను సగానికి సగం తగ్గించేశారు రామోజీ రావు. తన మిగితా కంపెనీల్లోనూ అవసరం లేని మ్యాన్ పవర్ ను ఇంటికి పంపించేశారు.
Ramoji Rao : నాలుగు మాస పత్రికలను పుల్ స్టాప్ పెట్టిన రామోజీ
తాజాగా రామోజీ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు మాస పత్రికలు అయిన విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం.. ఈ నాలుగు మాస పత్రికలను మూసేస్తున్నట్టు ప్రకటించారు.
వచ్చే నెల నుంచి ఈ మాస పత్రికలు ఇక కనిపించవు. కరోనాతో పాటు.. పాఠకుల అభిరుచులు కూడా మారుతుండటం, టెక్నాలజీ పెరగడం.. ఎక్కువగా ఈ బుక్స్ కు పాఠకులు అలవాటు పడటంతో.. మాస పత్రికలకు అదరణ తక్కువవుతుండటం, వాటి నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో నాలుగు మాస పత్రికలను మూసేస్తున్నట్టు రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది.
ఈ నిర్ణయంతో ఆ నాలుగు మాస పత్రికల్లో పనిచేసే సిబ్బంది రోడ్డు మీద పడాల్సిందే. వాళ్లను వేరే డిపార్ట్ మెంట్లలోకి తీసుకుంటారా? లేక వాళ్లకు సెటిల్ చేసి పంపించేస్తారా? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.