TDP : టీడీపీలోకి వద్దాము అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకి డోర్స్ క్లోజ్?

Advertisement

TDP : ప్రస్తుతం ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం. వచ్చే సంవత్సరం ఎన్నికలు, ఏపీలో బీజేపీ బలోపేతం కోసం కేంద్రం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడటం అనేది బీజేపీకి ఎంతో కొంత లాస్ అనే చెప్పుకోవాలి. అయితే.. బీజేపీకి రాజీనామా చేసింది.. టీడీపీలోకి రావడం కోసమే అన్నట్టుగా ఏపీలో ప్రచారం సాగుతోంది.

Advertisement
rayapati comments on kanna laxmi narayana Telugu Desam Party entry
rayapati comments on kanna laxmi narayana Telugu Desam Party entry

కన్నా టీడీపీలో చేరుతున్నారా.. టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ పని చేస్తారా.. అనేదానిపై తాజాగా రాయపాటి సాంబశివరావు స్పందించారు. గుంటూరు జిల్లాకే చెందిన రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ ఉద్దండులే. రాజకీయాల్లో ఎవరి పాత్ర వారిది. అసలు టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ ఎలా వస్తారు అన్నే రేంజ్ లో రాయపాటి ఫైర్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

Kanna Lakshminarayana

TDP : చంద్రబాబును తిట్టిన కన్నా ఎలా పార్టీలోకి వస్తారు?

మా పార్టీ అధినేత చంద్రబాబునే కన్నా తిట్టారు. అలాంటి కన్నా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని టీడీపీలోకి వస్తారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. నేను పులిని అంటూ చెప్పుకుంటారు కదా. ఆయన టీడీపీలోకి వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.. అంటూ రాయపాటి సాంబశివరావు కన్నా టీడీపీ ఎంట్రీపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒకవేళ వెళ్తే కన్నా.. జనసేనలోకి వెళ్తారేమో అని జోస్యం చెప్పారు. ప్రస్తుతం టీడీపీ బలంగానే ఉందని.. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని.. జనసేనతో పొత్తు లేకపోయినా కూడా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

Advertisement
Advertisement