RBI New Rules : UPI వినియోగదారులకు RBI కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RBI New Rules : UPI వినియోగదారులకు RBI కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  RBI New Rules : UPI వినియోగదారులకు RBI కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి..!

RBI New Rules : ప్రస్తుత కాలంలో చాలామంది ఫోన్ పే మరియు గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారింది.మన భారతదేశం మొత్తం డిజిటల్ చెల్లింపులతోనే ఎక్కువగా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరు రూపాయి నగదు లావాదేవీ లేకుండా మొబైల్ లోనే చెల్లింపులు జరుపుతున్నారు. అయితే భారతదేశంలో యూపీఐ వినియోగం 2016లో ప్రారంభం కాగా నేడు అది చాలా విస్తృతంగా మారింది. దీనివలన ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా వారి వ్యాపారాలను సక్రమంగా చేయగలుగుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల లోపాలను సరిదిద్దేందుకు అలాగే చెల్లింపులలో ఎలాంటి మోసాలు జరగకుండా నిర్ధారించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 – 2024 నుండి కొత్త చెల్లింపు నియామకాలను అమలు చేయడం జరిగింది.

అయితే దినిలో ఏ నిబంధనలు అమలులోకి వచ్చాయి…అయితే ప్రతిరోజు యూపీఏ ద్వారా చెల్లింపులు జరిపే వారికి పరిమితి విధించబడుతుందట. ఇక ఇప్పుడు ఈ పరిమితిని ఆసుపత్రిలో మరియు విద్యా సంస్థలకు పెంచినట్లు సమాచారం. ఈ క్రమంలోని ఇప్పుడు రోజుకు 5 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలను చేయవచ్చు . అదేవిధంగా వినియోగదారులకు ఫ్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ సదుపాయాలను కల్పిస్తున్నారు. అంటే అది లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. కానీ దీనికి పరిమితి ఉంటుంది. దీనిని వ్యక్తిగత వ్యాపారం మరియు వ్యాపారం కోసం వినియోగించుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు ప్రయోజనాలను పొందుతున్నారు.

ఒకవేళ మీకు ఏటీఎం కార్డు లేకపోతే ఇప్పుడు ఏటీఎం సెంటర్ లో యూపీఐ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా డబ్బులు తీసుకోవచ్చు. అయితే యూపీఏ ద్వారా మొదటిసారి చెల్లింపు కోసం నాలుగు గంటల శీతలీకరణ వ్యవధి అందించబడుతుంది. అంటే 2000 రూపాయల వరకు మొదట చెల్లింపు చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాలుగు గంటల లో చెల్లింపును రద్దు చేసుకునే విధంగా ఆర్బిఐ వినియోగదారులకు అనుమతించిది. అయితే మీరు ప్రతిరోజు యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లయితే ప్రతి చెల్లింపు చేయడంలో మీకు సహాయపడడానికి కొత్త నియమాలు కొన్నింటిని తెలుసుకోవడం మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది