Apple | ఆపిల్ తినడంలో జాగ్రత్త.. రసాయనాలతో పండించిన ఆపిల్స్ గుర్తించడం ఇలా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Apple | ఆపిల్ తినడంలో జాగ్రత్త.. రసాయనాలతో పండించిన ఆపిల్స్ గుర్తించడం ఇలా!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 October 2025,12:00 pm

Apple | ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. “రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు” అని వైద్యులు, డైటీషియన్లు సిఫారసు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్‌లో దొరుకుతున్న కొన్ని ఆపిల్స్‌ సహజమైనవి కావు. అధిక లాభాల కోసం కొందరు రైతులు, వ్యాపారులు రసాయనాలు, వ్యాక్స్‌, కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగించి పండించిన ఆపిల్స్‌ను విక్రయిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి తీవ్ర హానిని కలిగించే అవకాశం ఉంది.

#image_title

ఆపిల్స్‌లో సహజంగా కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, విటమిన్‌ C, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ రసాయనాల సహాయంతో పండించిన ఆపిల్స్‌లో ఈ పోషకాలు తగ్గిపోవడంతో పాటు, రసాయనాల దుష్ప్రభావం వల్ల శరీరానికి హానికరమైన పదార్థాలు చేరుతాయి.

నకిలీ ఆపిల్స్‌ను ఇలా గుర్తించండి:

ఆపిల్‌ చాలా మెరుస్తూ, ఆకర్షణీయంగా కనిపిస్తే దానిపై వ్యాక్స్‌ వేసి ఉండే అవకాశం ఎక్కువ. సహజంగా పండిన ఆపిల్స్‌ అంత మెరుపుగా ఉండవు.

ఆపిల్‌ వాసన కూడా సూచనగా ఉంటుంది. సహజ ఆపిల్స్‌కు తీపి వాసన ఉంటుంది. రసాయనాల వల్ల పండినవాటికి కాస్త విభిన్నమైన వాసన వస్తుంది.

సహజంగా పండిన ఆపిల్స్‌పై చిన్న లేదా పెద్ద మచ్చలు ఉండవచ్చు. కానీ రసాయనాలతో ఉత్పత్తి చేసిన ఆపిల్స్‌ పూర్తిగా మచ్చలు లేకుండా కనిపిస్తాయి.

ఒక సులభ పరీక్షగా ఆపిల్‌ను సగం కోసి నీటిలో వేయండి. అది నీటిలో తేలితే సహజమైనదని, మునిగిపోతే రసాయనాలతో పండించినదని అర్థం చేసుకోవాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది