Revanth Reddy : మీ డ్రామాలు ఆపి దమ్ముంటే యూపీలో తలపడండి.. టీఆర్‌ఎస్, బీజేపీలకు రేవంత్ రెడ్డి సవాల్
Revanth Reddy : టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీలు డ్రామాలు ఆడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ మరియు బీజేపీలు రెండు స్నేహ పార్టీలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎదుగుదలను తట్టుకోలేక ఆ రెండు పార్టీలు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు. బీజేపీని కావాలని సీఎం కేసీఆర్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా డ్రామాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లుగా నటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించాడు.
బీజేపీకి చెందిన పలువురు కేంద్ర నాయకులు మరియు ఇతర రాష్ట్రాల నాయకులు క్యూ కట్టాల్సినంత పని ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది. కేవలం ప్రజల దృష్టిలో మేము టీఆర్‌ఎస్ కు పోటీగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము తప్ప టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు అన్నట్లుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని తెలంగాణ ప్రజలు అంత అమాయకులు ఏమీ కాదు. వారు ఏం జరుగుతుంది అనే విషయాలను క్లీయర్ గా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉన్నారు. కనుక ఎన్ని డ్రామాలు చేసినా కూడా మిమ్ములను నమ్మరు అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశాడు.
Revanth Reddy : దమ్ముంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడు ః రేవంత్ రెడ్డి
బీజేపీ మరియు టీఆర్‌ఎస్ లు ఇక్కడ మాటలు మాట్లాడటం కాదు.. రెండు పార్టీలు ఇక్కడ కొట్టాడటం కాదు. దమ్ముంటే యూపీలో రేపు జరుగబోతున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పోరాటం చేయాలి. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏ పార్టీకి అయినా మద్దతుగా అక్కడ ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. అప్పుడు టీఆర్‌ఎస్ మరియు బీజేపీలు రెండు కూడా మిత్ర పక్షం కాదు అని నమ్ముతాము అన్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకు టీఆర్‌ఎస్ మరియు బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయి తప్ప రెండు పార్టీలు చిత్త శుద్దితో ఒకరిపై ఒకరు పోరాటం చేయడం లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రెండు పార్టీలు ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా కలుస్తాయి అన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేంద్రంలో కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే విధంగా కూటమిని ఏర్పాటు చేస్తున్నాడు తప్ప మోడీకి వ్యతిరేకంగా మాత్రం ఆయన కూటమికి ప్రయత్నాలు చేయడం లేదు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించాడు. కేసీఆర్ మాయ మాటలను నమ్మే రోజులు పోయాయి. జనాలు అన్ని చూస్తున్నారని అన్నాడు.