Revanth Reddy : కాంగ్రెస్ కు కీలక నేతలు గుడ్ బై.. అన్నీ నేను చూసుకుంటా.. అంటున్న రేవంత్ రెడ్డి?
Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీకి కొందరు నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా కొందరు పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న పార్టీకి వరుసగా షాక్ లు తగులుతుండటంతో పార్టీ హైకమాండ్ కు, సీనియర్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
జిల్లా స్థాయి నేతలు కూడా పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొందరు కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ సీనియర్ నేతలు అసమ్మతి నేతలపై దృష్టి సారించారు.
నిజానికి.. తెలంగాణ కాంగ్రెస్ లో నిఖార్సయిన నాయకులు తక్కువ. ఉన్నది ఇద్దరు ముగ్గురు మాత్రమే. అందులో ఒకరు రేవంత్ రెడ్డి. ఆయన ఓవైపు పార్టీని తెలంగాణలో బలపర్చేందుకు, పార్టీపై ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు పాదయాత్రలు, భరోసా యాత్రలు చేస్తుంటే.. మరోవైపు పార్టీలో అసమ్మతి నేతల గళం ఎక్కువైపోతోంది.
Revanth Reddy : అసమ్మతి నేతలపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి
పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీని బలపరచడంతో పాటు.. అసమ్మతి నేతలను కూడా పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఆపాల్సి ఉంటుంది. అందుకే.. రేవంత్ రెడ్డి.. ఆ బాధ్యతలు తీసుకున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇప్పటికే పార్టీని వీడిన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీకి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని.. అందరికీ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని రేవంత్ రెడ్డి అసమ్మతి నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన నేతలను మళ్లీ పార్టీలోకి రావాలంటూ కోరినట్టు తెలుస్తోంది.
అయితే.. ముఖ్యమైన నేతలు పార్టీ మారుతుంటే.. మిగితా సీనియర్ నేతలెవ్వరూ స్పందించడం లేదు. కేవలం రేవంత్ మాత్రమే బుజ్జిగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి.. రేవంత్ ను నమ్మి అసమ్మతి నేతలు పార్టీలోనే ఉంటారా? లేక ఈ వలసలు ఇలాగే కొనసాగుతాయా? అనేది తేలాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.